ప్రపంచం మొత్తం కరోనాచేతిలో కీలు బొమ్మగా మారింది. ఆ కంటికి కనిపించని మహమ్మారి చెప్పినట్టే ఈ ప్రపంచం నడుచుకుంటోంది. మన దేశంలో కూడా ఈ వైరస్ వ్యాప్తి ఎక్కవ అయింది. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా పరిస్థితి రోజురోజుకి చేయి దాటిపోతూ వస్తున్నాయి. కరోనాకేసులు ఎక్కువ అవుతున్నాయి. మరణాలు కూడా అధికమవుతున్నాయి. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలు పెరుగని పోరాటం చేస్తున్నాయి. ఇప్పుడు తాజాగా యువహీరోసందీప్కిషన్ ప్రజలకు మాస్కులు పంచి పెడుతూ సేవాగుణాన్ని చాటుకుంటున్నాడు. తానే స్వయంగా ఇంటింటికి తిరుగుతూ మాస్కులు, శానిటైజర్స్ పంచి పెడుతూ వారికి జాగ్రత్తలు తెలియజేస్తున్నాడు. ఈ విధంగా అందరూ తమకు సాధ్యమైన స్థాయిలో పేదవారికి సహాయం చేయమని పిలుపునిస్తున్నారు. ఈ విషయం తెలిసిన సందీప్కిషన్ అభిమానులు అతని ఔదార్యాన్ని చూసి మెచ్చుకుంటున్నారు. ఇదిలా ఉండగా సందీప్కిషన్ ప్రస్తుతం తెలుగులో 'ఏ 1 ఎక్ష్ప్రెస్స్' సినిమాతో పాటు తమిళంలో రెండు చిత్రాలలో నటిస్తున్నాడు.
]]>
కరోనావైరస్ మహమ్మారి పై పోరాటంలో భాగంగా తీసుకుంటున్న చర్యలకు తమ వంతు సాయం అందించడానికి పలువురు రాజకీయ మరియు సినీ ప్రముఖలు ముందుకొస్తోన్న సంగతి తెలిసిందే. సమాజం నుండి మనం తీసుకోవడమే కాదు.. ఆ సమాజానికి ఏదైన కష్టం కలిగితే తమ వంతు సాయం చేయడానికి కూడా ముందుకు రావాలి. ఇపుడు మన సెలబ్రిటీలు కూడా అదే చేస్తున్నారు. ఒక్కొక్కరుగా ముందుకు వచ్చి తమ ఔదార్యాన్ని ప్రకటిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోలు తమ వంతుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సాయం అందిస్తున్నారు. ఈ విషయంలో మన టాలీవుడ్యాక్టర్స్ ముందే వున్నారని చెప్పుకోవచ్చు. కరోనా వైరస్నేపథ్యంలో టాలీవుడ్సినీ ఇండస్ట్రీకి సంబంధించిన కార్మికులకు పని లేకుండా పోయింది. ఇందులో భాగంగా టాలీవుడ్సినీ నటులు 'కరోనా క్రైసెస్ ఛారిటీ'ని ఏర్పాటు చేసి తమ వంతు సాయం అందిస్తున్నారు. ఇంకోవైపు తమిళనటీనటులు దక్షిణాది చలనచిత్ర పరిశ్రమకు సంబంధించిన కార్మికులకు తమ వంతు ఆర్ధిక సాయం చేస్తున్నారు. చిరంజీవి, నాగార్జున, ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్, బాలయ్య, ఇలా స్టార్ హీరోలతో పాటు దర్శకులు, నిర్మాతలు తమకు చేతనైన సాయం చేస్తున్నారు. కరోనాక్రైసిస్ ఛారిటీ ద్వారా పేద కళాకారులకు, కార్మికులకు ఉచితంగా నిత్యావసర వస్తువులు, కూరగాయలు, మందులు, కొంత ఆర్థిక సాయాన్ని ఇవ్వనున్నారు. ఈ రోజు మహేష్బాబు సోదరి గల్లా పద్మావతితన వంతుగా కరోనాక్రైసిస్ ఛారిటీకి విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే.