ఇప్పటికే ప్రపంచాన్ని కదిలించి వేసినఈ కరోనా వైరస్మహమ్మారి ప్రజలను అనుక్షణం భయపడేలా చేస్తుంది. అంతేకాక దేశవ్యాప్తంగా పాకుతూ వస్తుంది. అయితే ఈ మహమ్మారిని ఆదిలోనే త్రుంచివేయాలని ప్రభుత్వం కట్టు దిద్దమయిన చర్యలను చేపడుతూ వస్తుంది. ఈ మేరకు లాక్ డౌన్ ను ప్రకటించారు. ఇకపోతే దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుంది..ఏప్రిల్ 14 తర్వాత కూడా లాక్ డౌన్ ను పొడిగించనున్నట్లు తెలుస్తుంది..
కోవిడ్ -19 కు వ్యతిరేకంగా పోరాడటానికి ప్రపంచం ఏకం కావడంతో, దేశంలోని ప్రతి ఒక్కరినీ సురక్షితంగా మరియు ఆరోగ్యంగా ఉంచడానికి పగలు,రాత్రి అని చూడకుండా పనిచేస్తున్న వైద్యులు, నర్సులు మరియు ఫ్రంట్‌లైన్ సిబ్బందికి టాలీవుడ్నటుడు రామ్ చరణ్భార్యఉపసనా కొనిదేలా కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్బంగా ఉపాసన సోషల్ మీడియాలో ఓ వీడియో ను పోస్ట్ చేసారు.
అందులో ఉపాసనమాట్లాడుతూ .. కోవిడ్ -19 రోగులకు చికిత్స అందించడానికి వైద్యులు మరియు నర్సులు తమ వ్యక్తిగత జీవితాలను త్యాగం చేసి శ్రమిస్తున్నారని కొనియాడారు.అలాగే ఇంట్లో ఉండి, సామాజిక దూరాన్ని కాపాడుకోవడం ద్వారా వైద్య సోదరభావానికి కృతజ్ఞతలు తెలియజేయవలసిన సమయం ఇది అని ఆమె అభ్యర్థించారు. కరోనావైరస్గురించి తప్పుడు సమాచారం సోషల్ మీడియాద్వారా వ్యాప్తి చేయవద్దని ఉపసనా విజ్ఞప్తి చేశారు.అంతేకాకుండా లాక్ డౌన్ ముగిసేవరకు ప్రజలు బయటకు రావద్దని సూచించారు.