Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 297444

ప్రధాని మోదీ మరో కీలక నిర్ణయం... పన్ను చెల్లింపుదారులకు కేంద్రం శుభవార్త...?

$
0
0
ప్రధానమంత్రినరేంద్రమోదీమరో కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో పన్ను చెల్లించే ఉద్యోగులకు శుభవార్త చెప్పారు. కేంద్రం పెండింగ్‌లో ఉన్న ట్యాక్స్ రిఫండ్స్‌ను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. కరోనావల్ల ఉద్యోగులు ఇబ్బందులు పడుతూ ఉండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ట్యాక్స్ పేయర్స్ కు ఉపశమనం కలగనుంది. 
 
కేంద్రం తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం 5 లక్షల రూపాయల వరకు పెండింగ్ లో ఉన్న ఆదాయపు పన్ను రిటర్నులకు వర్తించనుందని సమాచారం. తాజాగా తీసుకున్న నిర్ణయం జీఎస్టీ, కస్టమ్ రిఫండ్స్‌కు కూడా వర్తిస్తుందని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. కరోనావల్ల దేశంలో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయని... అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నమని ఆదాయపు పన్ను శాఖ ప్రకటన చేసింది. 
 
కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దాదాపు 14 లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం కలగనుంది. కేంద్రం సూక్ష్మ , మధ్య తరహా పరిశ్రమలతో పాటు లక్షబిజినెస్కంపెనీలకు ప్రయోజనం కలిగే విధంగా నిర్ణయం తీసుకుంది. ట్విట్టర్ఖాతా ద్వారా ఆదాయపు పన్ను శాఖ ఈ మేరకు ప్రకటన చేసింది. కేంద్రం చేసిన ఈ ప్రకటనపై పన్నుచెల్లింపుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

]]>

Viewing all articles
Browse latest Browse all 297444

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>