Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 305588

బాబాయ్ - అబ్బాయ్ కలిసి నటిస్తున్నారన్న వార్త పుకారేనా..!

$
0
0
కొన్ని కాంబినేషన్స్ వింటానికి చాలా ఆసక్తిగా ఉంటాయి. ఇక ఆ కాంబోలు తెరకెక్కితే వచ్చే కిక్కే వేరు. అలాంటి మ్యాజిక్ కోసం ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ ఎదురుచూస్తూంటారు. అలాంటి ఓ వార్త ఇప్పుడు మీడియాలో చక్కర్లు కొడుతూ..పవన్, మెగా పవర్ స్టార్అభిమానులను ఆనందపరుస్తోంది. ఆ వార్త ఏమిటంటే...పవన్ సినిమాలో రామ్ చరణ్గెస్ట్ రోల్ లో కనపడనున్నారని. పవర్ స్టార్పవన్కళ్యాణ్సినిమాకోసం మెగా అభిమానులు ఏ రేంజ్ లో ఎదురు చూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆజ్ఞతవాసి సినిమాఅనంతరం పవర్ స్టార్ని బిగ్ స్క్రీన్ పై చూసి చాలా కాలమవుతోంది. ఈ నేపథ్యంలో రీఎంట్రీ ఇచ్చిన పవన్వరుసపెట్టి సినిమాలను లైన్లో పెడుతున్నాడు. వేణు శ్రీరామ్దర్శకత్వంలో పింక్రీమేక్ 'వకీల్ సాబ్' చిత్రంలో నటిస్తున్నాడు. అక్కడితో ఆగకుండా వెంటనే తన కెరీర్లో 27వ చిత్రాన్నిక్రిష్దర్శకత్వంలో ఓకే చేసాడు. హరీష్ శంకర్దర్శకత్వంలో 28వ మూవీని కూడా లైన్లో పెట్టాడు. కెరీర్లో ఎప్పుడు లేనంత స్పీడ్ గా సినిమాలు ఓకే చేస్తున్నాడు. ఇది అభిమానులకు ఫుల్ జోష్నింపింది.

అయితే రామ్చరణ్.. బాబాయి పవన్కళ్యాణ్హీరోగా నటిస్తోన్న చిత్రంలో అతిథి పాత్రలో నటించడానికి ఓకే చెప్పినట్టు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. మొదటిసారిగా తన బాబాయ్ పవర్ స్టార్పవన్కళ్యాణ్తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం ఉన్నట్లు వార్తలు రావడంతో అభిమానులు ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. పవన్సినిమాలో రామ్ చరణ్కనిపించబోతున్నాడు అనగానే చాలా మంది ఫ్యాన్స్ ఇది రూమర్ కాకుండా నిజమైతే బావుండు అని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు తాజాగా రామ్ చరణ్పవన్సినిమాలో నటించే ఛాన్స్ లేదని తెలుస్తోంది. పింక్సినిమాకు రీమేక్గా వస్తున్న 'వకీల్ సాబ్' సినిమాలో పవన్డిఫరెంట్ లాయర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది కమెర్షియల్ సినిమాకాదు. కేవలం కొన్ని పాత్రలతోనే నడిచే సోషల్ మెస్సేజ్ తో నడిచే కథ. ఈ విషయం ఇప్పటికే వచ్చిన 'పింక్', అజిత్ 'నెర్కొండ పార్వాయి' చిత్రం చూసిన వాళ్లెవరికైనా ఈ విషయం అర్థం అవుతుంది. ఈ సినిమాలో రామ్ చరణ్పోషించే పాత్ర ఏమీ లేదని తెలుస్తోంది. రామ్ చరణ్ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్చిత్రం కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. అంతేకాకుండా చిరంజీవి 'ఆచార్య' మూవీలో స్పెషల్ రోల్ చేయనున్నాడు. ఈ నేపథ్యంలో చెర్రీ 'వకీల్ సాబ్' లో నటించే అవకాశమే లేదట.



ఇదిలా ఉండగా ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాషూటింగ్ కి కరోనాకర్ఫ్యూ కారణంగా బ్రేక్ పడింది. ఈ చిత్రాన్ని బోణీ కపూర్, దిల్రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అంజలి, నివేధా థామస్, అనన్యమరియు ప్రకాష్ రాజ్లు కీలక పాత్రలలో నటించనున్నారు. ఇక ఈ సినిమాఅనంతపురం పవన్క్రిష్తో సినిమాస్టార్ట్ చేయబోతున్నాడు. ఈ చిత్రానికి ఏ.ఎమ్. రత్నం నిర్మించనున్నారు.

]]>

Viewing all articles
Browse latest Browse all 305588

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>