కరోనా ప్రభావం రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది కరోనానియంత్రణ లో భాగంగా ప్రజలందరూ ఇళ్ల లోనే ఉండా లని ప్రభుత్వం పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే..అందులో భాగం గా లాక్ డౌన్ ను విధించింది..ఈ మేరకు కొందరు ప్రజలు మద్దతు తెలుపుతూ ఇళ్లకే పరిమితమయ్యారు.. కొందరేమో ప్రభుత్వ నియమాల ను ఉల్లంఘిస్తూ బయట తిరుగుతున్నారు.. అలాంటి వారికి కరోనాపై పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు..
నెల్లూరు జిల్లాలో కరోనాప్రభావం అధికం గా ఉన్నందువల్ల, నిత్యావసరాల కొరకు వచ్చే ప్రజలు ఎక్కువ సమయం బయట గడపొద్దంటూ వింజమూరు ఎస్.ఐ బాజిరెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లావింజమూరు శివారు తండాలో కె.జి.ఆర్.వి.యస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత లాక్ డౌన్ సమయంలో తండాలలో ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు గానూ దాతలు సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అన్నారు. కరోనావ్యాప్తిని అరికట్టేందుకు జిల్లాప్రజలు సహకరించాలని ఎస్ఐ బాజిరెడ్డి విజ్ఞప్తి చేశారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని, తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు.
]]>