Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 305555

అబ్బో, 'పుష్ప' టైటిల్ వెనుక అంత స్టోరీ దాగి ఉందా.....??

$
0
0
మొన్నటి సంక్రాంతిపండుగకానుకగా టాలీవుడ్మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్దర్శకత్వంలో అలవైకుంఠపురములోవంటి సూపర్ హిట్ సినిమాలో నటించిన స్టైలిష్ స్టార్అల్లు అర్జున్, నేడు తన 37 వ జన్మదినాన్ని కుటుంబ సభ్యుల మధ్య ఆనందంగా జరుపుకున్నారు. ఇక ఆ సినిమాఅనంతరం ప్రస్తుతం టాలెంటెడ్ సినిమాల దర్శకుడు సుకుమార్దర్శకత్వంలో పుష్ప అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు అల్లు అర్జున్. యువనటి రష్మిక మందన్నహీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్సంగీతాన్ని అందిస్తుండగా, టాలీవుడ్అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన మైత్రి మూవీమేకర్స్ వారు ఈ సినిమాని ఎంతో భారీగా నిర్మించడం జరుగుతుంది. ఇక నేడు విడుదల అయిన ఈ సినిమాఫస్ట్ లుక్, సెకండ్ లుక్ పోస్టర్లకు అల్లు అర్జున్ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ప్రేక్షకుల నుండి కూడా విశేషమైన స్పందన లభించింది. 

ఇకపోతే ఈ సినిమాటైటిల్ పుష్ప అని ఎందుకు పెట్టారు దానిపై టాలీవుడ్లో కొంత చర్చ జరుగుతోంది. అయితే ఈ సినిమాకి పుష్ప అనే టైటిల్ పెట్టడం వెనుక ఒక బలమైన కారణం ఉందని ఒక వార్త ప్రచారం అవుతోంది. ముందుగా వాస్తవానికి ఈ సినిమాటైటిల్ శేషాచలం అని పెడదామని అనుకున్నారట, ఎందుకంటే శేషాచలం అడవుల నేపథ్యంలో ఈ సినిమాసాగుతుందని అలా పెట్టాలని భావించిందట యూనిట్. ఆ తర్వాత సినిమాలోని హీరోక్యారెక్టర్ పేరైన పుష్ప రాజ్ని, సినిమాటైటిల్ గా నిర్ణయిస్తే బాగుంటుందని యూనిట్ ఆలోచించి ఆల్మోస్ట్ ఫిక్స్ చేసిందట. 



కాగా చివర్లో దర్శకుడు సుకుమార్మరింత ఆలోచన చేసి టైటిల్ ని పుష్పరాజ్ కంటే పుష్ప అయితేనే బాగుంటుందని, ఎందుకంటే గతంలో టాలీవుడ్లో వచ్చిన కొన్ని సినిమాలకు ఈ విధమైన లేడీ ఓరియంటెడ్ పేర్లు పెట్టి విజయాలు అందుకున్న సినిమాలు చాలా ఉన్నాయని, వాటిలో ముఖ్యంగా విక్టరీవెంకటేష్నటించిన లక్ష్మీ, తులసిసినిమాలు ఉదాహరణగా చెప్పుకోవచ్చని, అలానే వినడానికి కూడా పుష్ప అనే టైటిల్ కొంత పవర్ఫుల్ గా ఉంటుందని భావించి ఫైనల్ గా దాన్నే ఖరారు చేశారట. మొత్తంగా చూసుకుంటే బన్నీసుకుమార్సినిమాకి పుష్ప టైటిల్ పెట్టడం వెనుక ఇంత చర్చ దాగి ఉందని అర్థమవుతుంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ, ప్రస్తుతం ఈ వార్త మాత్రం పలు టాలీవుడ్వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.....!!


]]>

Viewing all articles
Browse latest Browse all 305555

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>