Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 305555

లాక్ డౌన్ ఎఫెక్ట్ : ఆ దేశంలో పెళ్లిళ్లే కాదు.. అవి కూడా బంద్..?

$
0
0
ప్రపంచం మొత్తం కరోనా  వైరస్  పై పోరాటం చేస్తుండగా  ఆయా దేశాల ప్రభుత్వాలు ప్రజలెవరూ ఇంటి నుంచి కాదు బయట పెట్టకూడదు అంటూ నిబంధనలు తెస్తున్నాయి. కరోనా  వైరస్ ను నియంత్రించేందుకు ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించేందుకు నిర్బంధాన్ని విధిస్తున్నాయి ఆయా దేశాల ప్రభుత్వాలు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం దాదాపు అన్ని దేశాలు లాక్ డౌన్ లో  ఉన్నాయి అని చెప్పవచ్చు. లాక్ డౌన్  నేపథ్యంలో ఎన్నో కఠిన నిబంధనలను అమలు చేస్తూ... కరోనా  వైరస్ పై పోరాటం చేస్తున్నాయి  ప్రభుత్వాలు . ఇలా రోజురోజుకు ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు మరింత కఠినతరం గా మారుతున్నాయి. 


 కేవలం భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా దేశాల్లో కరోనావైరస్  వ్యాప్తిని అరికట్టేందుకు... తమ దేశ ప్రజల ప్రాణాలను రక్షించేందుకు ఆయా దేశాల ప్రభుత్వాలు ఉన్న లాక్ డౌన్  అమలు చేస్తున్నాయి. లాక్ డౌన్  ఎఫెక్ట్ కారణంగా ప్రజలందరికీ ఇంటికే పరిమితం కావడంతో... కరోనా  వైరస్ వ్యాప్తి తగ్గుతుంది అని భావించి ఇలా అక్కడ లాక్ డౌన్  చేస్తున్నారు . ఇక ఈ లాక్ డౌన్   దుబాయి లోనూ  కొనసాగుతుంది. ఈ క్రమంలోనే దుబాయ్న్యాయ శాఖ తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. న్యాయ శాఖ నుంచి తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు... దుబాయ్లో ఎలాంటి పెళ్లిళ్లు కానీ విడాకులు కానీ జరగకూడదు అంటూ హుకుం జారీ చేసింది. 



 అయితే ఈ నిర్ణయం వల్ల అక్కడి ప్రజలందరికీ భారీ షాక్ తగిలినట్లయింది. ఎందుకంటే పెళ్లిలాంటి వెకిషన్ ను  సరైన ప్లేస్  దుబాయ్అని భావిస్తూ ఉంటారు. అలాంటిది దుబాయ్లో పెళ్లిళ్లు చేసుకోవద్దు అని రూల్ పెట్టడం ప్రస్తుతం చాలామందికి నిరాశ కలిగిస్తుంది. అయితే లాక్ డౌన్  ఉన్న నేపథ్యంలో కచ్చితంగా బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు పర్మిషన్ తీసుకుని బయటకు వెళ్లాలని సూచిస్తున్నారు అధికారులు. లాక్ డౌన్  విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే  కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

]]>

Viewing all articles
Browse latest Browse all 305555

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>