ఇదే సమయంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా.. వారికి అవసరమైన నిత్యావసరాలకు తగిన ఏర్పాట్లు చేస్తారు. ఇక క్లస్టర్లలో పోలీసు అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ‘కార్డన్ ఆఫ్’ చేసేదిశగా అడుగులు వేస్తున్నారు. కాగా, గత నెలలో ఢిల్లీవెళ్లివచ్చినవారు కేవలం హైదరాబాద్ జిల్లాలోనే 593 మంది ఉండడం గమనార్హం. వారిలో 83 మందికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. వీరి ద్వారా మరో 51 మందికి కరోనా వ్యాపించింది. వేర్వేరు మార్గాల్లో మరో 70 మందికి సోకింది. వీరందరి నివాస ప్రాంతాలను జియోట్యాగ్ చేస్తున్నారు. బుధవారం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని మొత్తం 659 మంది నివాసాలకు అధికారులు జియోట్యాగ్ చేశారు. అయితే..ప్రస్తుతం కంటైన్మెంట్ ప్రాంతాలను ప్రకటించారు.
1) రాంగోపాల్‌పేట, 2) షేక్‌పేట్, 3) రెడ్‌హిల్స్ , 4) మలక్‌పేట్, సంతోష్‌నగర్, 5) చాంద్రాయణగుట్ట , 6) అల్వాల్ , 7) మూసాపేట, 8) కూకట్‌పల్లి , 9) కుత్బుల్లాపూర్, గాజులరామారం, 10) మయూరీనగర్, 11) యూసుఫ్‌గూడ, 12) చందానగర్, 13) బాలాపూర్, 14) చేగూరు, 15) తుర్కపల్లి
]]>