Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 305593

తెగ ఫీలయిపోతున్న రౌడీ హీరో ఫ్యాన్స్..!

$
0
0
విజయ్ దేవరకొండపద్దతి ఆయన ఫ్యాన్స్ కే నచ్చడం లేదట. కరోనాప్రపంచాన్ని కల్లోలం చేస్తుంటే.. తనకేమీ పట్టనట్టు ప్రవర్తించిన విజయ్ దేవరకొండతీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఎట్టకేలకు స్పందించి విజయ్మాస్క్ లు డాక్టర్లకు వదిలేసి.. కర్చీఫ్ లు.. చున్నీలు కట్టుకోవాలని ఇచ్చిన సలహాపై.. సెటైర్స్ పడుతున్నాయి. అదేమిటో గానీ.. తమ హీరోసైలెట్ గా ఉన్నా తప్పే.. మాట్లాడినా తప్పుగానే ఉంటుందని రౌడీ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. 

కరోనాలాక్ డౌన్ పెట్టి 15రోజులు దాటింది. జనత కర్ఫ్యూ సమయంలో చిరంజీవినుంచి చిన్న హీరోవరకు అందరూ స్పందించారు. చప్పట్లు కొడుతూ స్ఫూర్తిగా నిలిచారు. కరోనామహమ్మారి కబళించడం మొదలు పెట్టడంతో.. తమ వంతు సాయం అందించారు. 15రోజులుగా విజయ్అడ్రస్ సోషల్ మీడియాలో కనిపించలేదు. విజయ్ దేవరకొండఏమైపోయాడు.. ఎక్కడున్నాడు. కరోనాసమయంలో తమ హీరోస్పందించలేదన్న బాధ రౌడీ ఫ్యాన్స్ లో మొదలైంది. 



యూత్ లో ఏ హీరోకూ లేనంత ఫాలోయింగ్ విజయ్దేవరకొండకు ఉంది. ఈ హీరోచెబితే వినివాళ్లు ఉన్నారు. కనీసం మాటల రూపంలో సలహాలు సూచనలు చేస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. జనత కర్ఫ్యూ మార్చి 21న పెడితే.. మార్చి 19నుంచి సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ చేయడకపోవడం రౌడీ ఫ్యాన్స్ ను నిరాశపరిచింది. ఎట్టకేలకు స్పందిస్తే.. ఆయన మాటలు వివాదాస్పదమయ్యాయి. 



కరోనాపై ఎట్టకేలకు స్పందించిన విజయ్దేవరకొండ.. కరోనా వైరస్వ్యాప్తిని నివారించేందుకు అందరూ ఏదో ఒఖలా ముఖాన్ని కవర్ చేసుకోండని సూచించాడు. ఈ క్రమంలో స్కార్ఫ్ కట్టుకున్న ఫోటో పోస్ట్ చేశాడు. కొరత కారణంగా మాస్క్ లను డాక్టర్లు వదిలేసి దానికి బదులుగా కర్చీఫ్ కట్టుకోండి. లేదంటే స్కార్ఫ్ ధరించండి.. అదీ కుదరకపోతే మీ తల్లి చున్నీనైనా యూజ్ చేసుకోండని సూచించాడు. అయితే విజయ్టిప్స్ పై కొందరు నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. 

]]>

Viewing all articles
Browse latest Browse all 305593

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>