కరోనా ను కట్టడి చేయడానికి ఏప్రిల్ 14 వ తేదీ వరకు లాక్ డౌన్ ను ప్రకటించింది..ఈ మేరకు ప్రజలు ఎక్కడా బయట తిరగడం లేదని అర్థమవుతుంది.. ప్రజల సమస్యలను అర్థం చేసుకుంటూ ప్రముఖ సినీ, రాజకీయ ప్రముఖులు విరాళాలను అందిస్తున్నారు.. కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న సినిమాలు వాయిదా పడ్డాయి..విడుదల సినిమాలు కూడా వాయిదా పడటంతో సినీ వర్గాల ప్రజలు ఆందోళనలో పడ్డారు.
ఈ సందర్భంగా సినీ ప్రముఖులు వారి లోని కళలను వెలికి తీస్తూ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ సందడి చేస్తున్నారు. ఇకపోతే ఇప్పుడు సినిమాలు చిత్రీకరణ పూర్తి చేసుకుంటున్న సినిమాలు ఇంట్లోనే ఉంటూ డబ్బింగు పనులు పూర్తి చేసుకుంటున్నాయి.. సాప్ట్ వేర్ ఉద్యోగులకు మాత్రమే కాదు ..సినీ ప్రముఖులకు కూడా ఈ భాధలు తప్పడం లేదు..కరోనా ప్రభావం తో సినిమాషూటింగ్ లు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి.
అసలు విషయానికొస్తే .. తాజాగా సినీ నటుడు అక్కినేనినాగాచైత్యన్య పోలీసులకు గ్రేట్ అంటూ ఓ వీడియోను షేర్ చేసాడు. ఈ సందర్బంగా చైతు మాట్లాడుతూ..కరోనా నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలను తీసుకొని ప్రభుత్వం లాక్ డౌన్ ను విధించింది. లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. కానీ పోలీసులు మాత్రం మనల్ని, మనరాష్ట్రాన్ని కాపాడటానికి అహర్నిశలు కష్టపడుతున్నారు. నిజంగా వాళ్ళ సేవలు అభినందనీయం అని చైతు అన్నారు.అందుకే ప్రభుత్వ నిర్ణయాలను గౌరవిద్దాం .. మనదేశాన్ని మనం కాపాడుకుందాం .. కరోనా పై జాగ్రత్తలు పాటిస్తూ ఇళ్లలోనే ఉండాలని చైతన్యసూచించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆ వీడియో పై స్పందించిన పోలీసులు ధన్యవాదాలు తెలిపారు..
]]>Yuva Samrat @chay_akkineni salutes telanganapolice and other departments who are serving us during this #CoronaCrisis#IndiaFightsCorona#LetsFightCoronaTogetherpic.twitter.com/yk7sdsf5JL
— BARaju (@baraju_SuperHit) April 8, 2020