*అద్భుతమైన మేధోశక్తి భారత్ సొంతం. నిజానికి.. నమ్మశక్యం కాని ప్రతిభ భారత్‌లో ఉంది. స్థానికంగానే.. తక్కువ ఖర్చుతో నిర్ధారణ పరీక్షల సమాగ్రిని కూడా తయారు చేయగల శక్తిసామర్థ్యాలు భారత్‌కు ఉన్నాయి* అని ప్రొఫెసర్ అశిష్‌కుమార్ ఝా అన్నారు. ఇక్కడ మరొక విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. భారత్‌లో ఇప్పటికిప్పుడు లాక్‌డౌన్ ఎత్తేసే పరిస్థితులు కనిపించడం లేదని అన్నారు. ఒకవేళ ఎత్తేసినా.. భారత్‌లో మళ్లీమళ్లీ లాక్‌డౌన్లు వస్తూనే ఉంటాయని ఆయన పేర్కొన్నారు. కానీ.. లాక్‌డౌన్‌లకు తొందరగా ముగింపు పలకాలన్నదే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అంటే.. ప్రొఫెసర్ ఆశిష్‌కుమార్ ఝా చెబుతున్న విషయాలను బట్టి ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రభావం సుమారు 12-18 నెలల వరకు ఉండడం ఖాయమని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. ఆయన మాటల్ని బట్టి భారత్‌లో మళ్లీ మళ్లీ లాక్‌డౌన్ వస్తూనే ఉంటాయన్నమాట.
]]>