కరోనా మహమ్మారి సౌదీ రాజకుటుంబంపై పగబట్టినట్లు ఉంది. ఏకంగా 150మందికి పైగా ఈ వ్యాధి విస్తరించినట్లు తెలియడంతో అక్కడ భయాందోళనలు మొదలయ్యాయి. ఇప్పటికే బ్రిటన్‌కు చెందిన ప్రిన్స్చార్లెస్ కోవిడ్ బారిన పడగా.. తాజాగా సౌదీ రాజకుటుంబానికి చెందిన 150 మందికి ఈ ఇన్ఫెక్షన్ సోకినట్లు తెలుస్తుండటంతో అంతర్జాతీయంగా ఈ విషయం చర్చనీయాంశ మైంది. 84 ఏళ్ల కింగ్సల్మాన్.. జెడ్డా సమీపంలోని ఎర్ర సముద్రంలో ఉన్న ఐలాంట్ ప్యాలెస్‌లో సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నారని సమాచారం. క్రౌన్ ప్రిన్స్మహ్మద్ బిన్ సల్మాన్ఆయన కుమారుడు, కొందరు మంత్రులు కూడా ఇక్కడే ఉన్నారని తెలిపింది.
ఇప్పటికే రాయల్ ఫ్యామిలీలో చాలా మందికి కరోనా సోకిందని ఆ కథనంలో పేర్కొన్నారు.సౌదీ అరేబియాలో రియాద్ గవర్నర్‌గా ఉన్న సౌదీ ప్రిన్స్ఫైజల్ బిన్ బందర్ బిన్ అబ్దులాజిజ్ అల్ సౌద్‌కు కోవిడ్ -19 సోకింది. అయితే కొద్దిరోజులుగా ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు అక్కడి వైద్య వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇదిలా ఉండగా రాయల్ ఫ్యామిలీ సభ్యులకు చాలా మంది కోవిడ్ సోకినట్లు ప్రచారం జరుగుతోంది. దాదాపు 150మందికి పైగా ఈ సంఖ్య ఉంటుందని వైద్య వర్గాలు స్పష్టం చేసినట్లు న్యూయార్క్టైమ్స్ ఓ కథనంలో వెల్లడించింది. వీరందరికి కూడా కింగ్ఫైజల్ స్పెషలిస్ట్ హాస్పిటల్‌లో వైద్యం అందించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నట్లు పేర్కొంది.
అంతేకాదు..ఇక్కడ ఉన్న సామాన్య ప్రజానీకాన్ని, రోగులను ఇతర ఆస్పత్రులకు తరలించినట్లు కథనంలో రాసింది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వైద్య వర్గాలు సిద్ధంగా ఉండాలని హాస్పిటల్ వర్గాలు హై అలర్ట్‌ను జారీ చేశాయని న్యూయార్క్టైమ్స్ తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న వీఐపీల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వైద్యాశాలల్లో ట్రీట్‌మెంట్ ఉంటుందని అధికారులు ప్రకటించడం గమనార్హం. అయితే దేశంలో నానాటికి కరోనా విస్తరిస్తుండటంతో ఎన్ని కేసులు నమోదవుతాయో తెలీదని, కానీ అంతా అప్రమత్తతో వ్యవహరిస్తున్నట్లు అక్కడి రాజవంశీయులు పేర్కొన్నారు.
కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple
]]>