చిరంజీవివిష్కు బదులుగా బన్నీ పెట్టిన ట్వీట్ కింద కామెంట్లు చదివితే ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది. అసలే తన మీద ఓ వర్గం మెగా అభిమానులు ఆగ్రహంతో ఉండగా.. వాళ్ల ఆగ్రహాన్ని ఇంకా పెంచేలా వ్యవహరించాడు అల్లు అర్జున్. ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్ అల్లు అర్జున్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ అతణ్ని మెగాస్టార్‌గా అభివర్ణించింది. దీనికి బదులుగా బన్నీ థ్యాంక్స్ చెప్పాడు. శ్రేయా మెసేజ్ చదివి బదులిచ్చిన బన్నీ.. తనను మెగాస్టార్అని పిలవొద్దని, చిరుకు మాత్రమే అది సొంతమని ఆమెకు చెప్పకపోవడాన్ని మెగా అభిమానులు తప్పుబడుతున్నారు. బన్నీ శ్రేయాకు బదులివ్వకపోతే మెసేజ్ చదవలేదనుకోవచ్చు కానీ.. రిప్లై ఇవ్వడంతో తనను తాను మెగాస్టార్‌గా భావిస్తున్నాడంటూ మండిపడుతున్నారు చిరు ఫ్యాన్స్. శ్రేయా మాత్రమే కాదు.. క్రికెటర్ రాహుల్‌శర్మతో పాటు కొందరు ఉత్తరాది జనాలు బన్నీని మెగాస్టార్‌గా అభివర్ణిస్తూ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడం గమనార్హం. మరి ఈ ఫ్యాన్స్ వార్కి ఎప్పుడు ఫులుస్టాప్ పడుతుందో చూడాలి.
]]>Happy birthday to the megastar@alluarjun May you always shine brightest and spread joy in our lives through your blockbuster films.. #HappyBirthdayAlluArjun
— shreya ghoshal (@shreyaghoshal) April 7, 2020