ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని చిత్ర యూనిట్ ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చింది. దానికి మంచి ఆదరణ వచ్చింది సోషల్ మీడియాలో. దాన్ని చాలా మంది షేర్ చేయడమే కాదు దానికి సంబంధించిన కామెంట్స్ లో కూడా ఈ సినిమాకోసం తాము ఎంతగా ఎదురు చూస్తున్నాము అనేది చెప్తున్నారు. దీనితో ఈ సినిమావిషయంలో రాజమౌళికీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఆన్లైన్ వీడియో యాప్ తో ఒప్పందం చేసుకోవాలని చూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన వార్తలు అన్నీ కూడా దాని ద్వారా బయట పెట్టాలని భావిస్తున్నారు.
అయితే అది హాట్ స్టార్ అని అంటున్నారు. ఆ యాప్ లో దీనికి సంబంధించిన వార్తలు అన్నీ బయట పెట్టడమే కాకుండా సినిమాను కూడా అందులో సినిమావిడుదల అయిన నెల రోజుల్లో అందుబాటులోకి తీసుకుని వచ్చే ఆలోచన చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇది ఎంత వరకు నిజమో తెలియదు గాని దీనిపై త్వరలో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆ యాప్ ద్వారానే దీనికి సంబంధించిన టీజర్, ట్రైలర్ ఫస్ట్ లుక్స్ అన్ని విడుదల చెయ్యాలని చూస్తున్నట్టు టాలీవుడ్వర్గాలు అంటున్నాయి.
]]>