ఈ విషయంపై సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలను ఎవరూ నమ్మకండి అంటూ ఆమె విజ్ఞప్తి చేశారు. ఆయన ఎక్కడా పడిపోలేదని, ఉన్నట్లు ఉండి కోమాలోకి వెళ్ళిపోయాడని ఆమె అన్నారు. త్వరగా కోలుకొని తను ఆరోగ్యంగా ఇంటికి రావాలని దేవుని ప్రార్థిస్తున్నామని ఆమె అన్నారు. ఇదిలా ఉండగా.. నర్సింగ్ యాదవ్ తెలుగు, తమిళ, హిందీభాషలలో కలిపి సుమారు 300 చిత్రాలకు పైగా నటించారు. విజయనిర్మల దర్శక నిర్మాతగా వచ్చిన హేమాహేమీలు చిత్రంతో వెండితెరకి ఆయన పరిచయం అయ్యారు. ఇక దర్శకుడు రాం గోపాల్ వర్మసినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత చిరంజీవినటించిన ఎక్కువ సినిమాలలో నర్సింగ్ యాదవ్ నటించాడు. తనదైన నటనతో తెలుగు చిత్రసీమలో నర్సింగ్‌యాదవ్ ప్రత్యేక గుర్తింపును పొందారు. ప్రధానంగా తనదైన మాటతీరుతో అందరినీ ఆకట్టుకున్నారు. అనేక సినిమాల్లో డైలాగ్ డెలివరీతోనే తన పాత్రకు ప్రాణం పోస్తాడు నర్సింగ్ యాదవ్. నర్సింగ్‌యాదవ్ త్వరగా కోలుకోవాలని, మళ్లీ సినిమాల్లో నటించాలని తెలుగు చిత్రసీమ ప్రముఖులతోపాటు ఆయన అభిమానులు, ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.
]]>