Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 305612

సన్ టీవి విరాళం పై స్పందించిన వార్నర్...

$
0
0
ఇండియాలో కరోనా రోజు రోజు కి విజృంభిస్తుంది. ఈ మహమ్మారి పై పోరుకు ఇప్పటికే చాలా మంది  ప్రముఖులు పీఎం కెర్స్ ఫండ్ కు అలాగే రాష్ట్ర ప్రభుత్వాలకు భారీగా విరాళాలను ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా  ప్రముఖ టీవి నెట్వర్క్ సన్ గ్రూప్ కూడా 10 కోట్ల విరాళం ఇస్తున్నామని ట్విట్టర్ద్వారా ప్రకటించింది. ఐపీఎల్ లో సన్ హైదరాబాద్జట్టు కూడా సన్ గ్రూప్ లో భాగమేనని తెలిసిందే. దాంతో సన్ టీవి ఇచ్చిన విరాళం పై ఆస్ట్రేలియాస్టార్ ఓపెనర్, సన్ రైజర్స్ హైదరాబాద్కెప్టెన్ డేవిడ్ వార్నర్ స్పదించాడు. విరాళం ఇవ్వడం చాలా బాగుంది.. వెల్ డన్ సన్ గ్రూప్ అంటూ వార్నర్ ట్వీట్ చేశాడు. 
 




 

ఇక బాల్ ట్యాపరింగ్ వ్యవహారంతో  2018 ఐపీఎల్ సీజన్ కు దూరమైన వార్నర్ గత సీజన్ లో రాణించి పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. గత ఏడాది ఐపీఎల్ లో వార్నర్ 12మ్యాచ్ ల్లో 69.20 సగటు తో 692 పరుగులు చేశాడు. దాంతో ఈసీజన్ కోసం వార్నర్ కెప్టెన్ గా తిరిగి ఎన్నికయ్యాడు. అయితే కరోనా వల్ల ఈఏడాది ఐపీఎల్ రద్దైయ్యే పరిస్థితి నెలకొంది.  మార్చి 29 ప్రారంభంకావల్సిన ఐపీఎల్ కరోనా వల్ల ఏప్రిల్ 15వరకు వాయిదాపడింది. ఇప్పటికి కరోనాప్రభావం ఏ మాత్రం తగ్గకపోవడంతో ఈఏడాది ఐపీఎల్ ను రద్దు చేయడం ఖాయంగా కనిపిస్తుంది. 
]]>

Viewing all articles
Browse latest Browse all 305612

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>