కూరగాయల కోసం ఏకంగా ఓ వృద్ధుడిని దారుణంగా హత్యచేసిన ఘటన దేశ రాజధానిఢిల్లీలో వెలుగులోకి వచ్చింది. లాక్ డౌన్ కారణంగా కూరగాయల కొరత ఏర్పడడంతో.. కొంతమంది వ్యాపారులు కూరగాయల ధరలను భారీగా రేట్లు పెంచి అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సామాన్య ప్రజలకు నిత్యావసర వస్తువులు కూరగాయల కొనడానికి కూడా ఇబ్బందిగా మారింది. ఇక ఇక్కడ ఓ వ్యక్తి కూరగాయలు దొంగతనం చేసేందుకు నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాడు . అయితే ఇక్కడ ఒక వ్యక్తి కూరగాయలను దొంగలించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే కూరగాయలను దొంగతనం చేస్తున్న వ్యక్తిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా .. ఏకంగా క్షణికావేశంలో ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాడు సదరు వ్యక్తి. దేశ రాజధానిఢిల్లీలోనే సంజయ్ కాలనీ ప్రాంతంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.
సంజయ్ కాలనీకి చెందిన మనీష్సమీపంలోని మార్కెట్కు వెళ్ళి కూరగాయలు కొనుక్కొని ఇంటికి వస్తుండగా.... పొరుగున ఉండే నన్నే అనే వ్యక్తితో గొడవపడ్డాడు . ఈ క్రమంలోనే మనిష్ కూరగాయలు దొంగలించి చాలనుకున్న నన్నే వ్యక్తి తో గొడవ పడ్డాడు. ఇక ఇది గమనించిన తండ్రిశాంతాలాల్ అక్కడికి చేరుకున్నాడు.ఇద్దరికి సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ శాంతిలాల్ పై నన్నే కర్రతో తీవ్రంగా దాడి చేసి కూరగాయల దొంగలించి పరారయ్యాడు.దీంతో శాంతా లాల్ తలకు తీవ్ర గాయం కావడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడే అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్థారించారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
]]>