ఈ పరిణామంతో డైరెక్టుగా అసెంబ్లీనుంచి బయటకు వచ్చిన జగన్...నేరుగా తానేంటో ప్రజా క్షేత్రంలో తేల్చుకోవడానికి ప్రజా సంకల్ప పాదయాత్ర స్టార్ట్ చేసి 2019ఎన్నికల్లో భారీ మెజార్టీతో అధికారంలోకి రావడం జరిగింది. ఇదిలా ఉండగా గతంలో వైసిపిపార్టీనుండి టిడిపిలోకి వెళ్లిన నాయకులకు ప్రస్తుతం ఆ పార్టీలో ఆదరణ లేకుండా పోయిందట. చాలా చోట్ల టీడీపీక్యాడర్ కావాలని ఈ జంపింగ్ జపాంగ్ అభ్యర్థులను పక్కన పెడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వైసిపిపార్టీపెద్దలతో వాళ్లు టచ్ లోకి వచ్చి..తిరిగి వైసీపీలోకి వచ్చేస్తాము అని...జగన్ పచ్చజెండా ఊపితే రెడీగా ఉన్నామని అంటున్నారట.
ముఖ్యంగా పామర్రు మాజీ ఎమ్మెల్యేఉప్పులేటి కల్పన , పాడేరు మాజీ ఎమ్మెల్యేగిడ్డి ఈశ్వరి, రంపచోడవరం మాజీ ఎమ్మెల్యేవంతల రాజేశ్వరి వీరంతా జగన్అవకాశం ఇస్తే పార్టీలోకి వస్తామని ఈ ఉక్కిరి బిక్కిరి రాజకీయాల్లో ఉండలేకపోతున్నాము అని అంటున్నారు. మేము గతంలో పార్టీని మోసం చేసి టిడిపిలోకి వెళ్ళటం తప్పే అంటూ...అధ్యక్షుడు జగన్ని నేరుగా ఎదుర్కొనలేక మీతో మాట్లాడుతున్నాము అంటూ పార్టీపెద్దలతో మాట్లాడుతూ పార్టీలోకి మళ్లీ రాణిస్తే అదే పదివేలు ఊపిరి పీల్చుకుంటాము అని అంటున్నారట. మరి జగన్రాణిస్తాడో లేదో చూడాలి.
]]>