ఆ విధంగా మన మన టాలీవుడ్నుండి కూడా పలువురు నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, సాంకేతికనిపుణులు ఇప్పటికే విరాళాలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ముఖ్యంగా దాదాపుగా స్టార్ హీరోలు అందరూ కూడా భారీగానే విరాళాలు ప్రకటించడం జరిగింది. అయితే హీరోలు ప్రకటించిన విరాళాల పై నేడు ఒక మీడియాఛానల్ వీడియోలో కొన్ని సంచలన కామెంట్స్ చేసారు ప్రముఖ డాన్స్ మాస్టర్అయిన రాకేష్ మాస్టర్. చిరంజీవి, రామ్ చరణ్, బాలయ్య, ఎన్టీఆర్, మహేష్, అల్లు అర్జున్, ప్రభాస్, రవితేజ, ఇలా చెప్పుకుంటూ పోతే తాము అంత ఇచ్చాము ఇంత ఇచ్చాము అని చెప్పుకుంటున్న ఈ హీరోలు, అసలు ఎవరికి ఆ డబ్బులు ఇచ్చారో వాటి తాలూకు చెక్కు ప్రూఫులు కానీ లేదా ఇస్తున్నప్పుడు తీసిన వీడియోలు కానీ బయట ఎందుకు పెట్టడం లేదని రాకేష్ మాస్టర్ప్రశ్నించారు.
వాస్తవానికి తనకు హీరోలందరి పై మంచి అభిమానం ఉందని, అయితే ప్రస్తుతం వారు ఇచ్చిన విరాళాలు వారి స్థాయికి తగినవి కాదని, ఇంకా అంతకంటే ఎక్కువ కూడా వారు ఇచ్చివుండవచ్చునని, అయినా ఇచ్చే సమయంలో ప్రూఫ్ చూస్తేనే ఎవరైనా నమ్మేది, ఇటువంటి ప్రకటనలు మెజారిటీ ప్రజలు నమ్మినప్పటికీ నాలాంటి కొందరు మాత్రం నమ్మరని విమర్శలు చేసారు. అయితే రాకేష్ మాస్టర్వాదనపై కొంత భిన్నాభిప్రాయాలు వినపడుతున్నాయి. ఆయన మాట్లాడినదానిలో కూడా వాస్తవం ఉందని కొందరు అంటుంటే, మరికొందరు మాత్రం, అంతపెద్ద హీరోలు విరాళాలు ఇవ్వకుండా ఇచ్చాం అని ఎలా చెప్పుకుంటారు, తప్పనిసరిగా ఇవ్వడానికి సిద్దము అయిన తరువాతనే ప్రకటన చేస్తారు కదా అని కామెంట్స్ చేస్తున్నారు. కాగా మన హీరోలపై రాకేష్ మాస్టర్చేసిన వ్యాఖ్యలు పలు మీడియామాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి....!!
]]>