ఇలా భారత ప్రధానిఇచ్చిన సూచనలను సలహాలను పాటిస్తూ కరోనా వైరస్పై పోరాటం లో ముందుకు సాగుతుంది భారత ప్రజానీకం. ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ప్రధానినరేంద్ర మోడీకి సంబంధించి ఒక వార్త హల్చల్ చేస్తోంది. కరోనా ను తరిమికొట్టేందుకు అలుపెరగని పోరాటం చేస్తున్న దేశ ప్రధానినరేంద్ర మోడీకి గౌరవం ఇచ్చేందుకు ప్రతి ఒక్కరూ సాయంత్రం ఐదు గంటల సమయంలో ఐదు నిమిషాల పాటు నిలబడి మోదీకి గౌరవం ఇవ్వాలి అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇక ఈ విషయం ఏకంగా ప్రధానినరేంద్రమోదీవరకు వెళ్ళింది.
అయితే దీనిపై స్పందించిన ప్రధానినరేంద్ర మోడీదేశ ప్రజలందరికీ మరో పిలుపునిచ్చారు. ఐదు నిమిషాల పాటు నిలబడి తనను గౌరవించాల్సిన అవసరం లేదని.. తనను గౌరవించాలి అనుకుంటే ప్రతి ఒక్కరు ఒక పేద కుటుంబానికి సహాయం చేయాలి అంటూ పిలుపునిచ్చారు నరేంద్రమోడీ. దేశ ప్రధానినరేంద్ర మోడీఇచ్చిన పిలుపు మేరకు... చాలా మంది పేద ప్రజలకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. నిత్యావసరాలను అందించడం సహా ఆహారాన్ని కూడా అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానినరేంద్ర మోడీఇచ్చిన సూచనలు పై విశ్లేకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఒక అద్భుతమైన సూచనను దేశ ప్రజానీకానికి ఇచ్చారు అంటూ ప్రశంసిస్తున్నారు.