Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 297540

కరోనా రాజకీయం: శత్రువులు మళ్ళీ లైన్‌లోకి వచ్చారు...!

$
0
0
ఏపీలో ఓ వైపు కరోనా మహమ్మారి వణికిస్తుంటే, మరోవైపు అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు కరోనాపై కూడా రాజకీయం చేసేస్తున్నారు. ఈ రాజకీయం చేయడంలో రెండు పార్టీలు అసలు తగ్గడం లేదు. ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకునే పనిలో ఉంటున్నారు. ఒకవేళ జగన్ప్రభుత్వం ఏదైనా మంచి పని చేసిన దాన్ని టీడీపీఒప్పుకునే పరిస్థితిలో లేదు. అదేవిధంగా చంద్రబాబు ఏదైనా మంచి సలహా ఇచ్చిన దాన్ని వైసీపీపట్టించుకోవడం లేదు.

అయితే ఇలా ఈ రెండు పార్టీల మధ్య రాజకీయం నడుస్తూనే ఉంది. ఈ క్రమంలోనే పాత శత్రువులుగా ఉన్న ఇద్దరు లేడీ లీడర్లు, మళ్ళీ లైన్‌లోకి వచ్చి విమర్శలు చేసుకునే కార్యక్రమం చేశారు. గత ఐదేళ్లు టీడీపీఅధికారంలో ఉన్న సమయంలో అప్పుడు టీడీపీఎమ్మెల్యేగా ఉన్న వంగలపూడి అనిత, వైసీపీఎమ్మెల్యేగా ఉన్న రోజాకు అసలు పడదనే విషయం తెలిసిందే. ఈ ఇద్దరు చాలాసార్లు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి.



అలాగే అసెంబ్లీలో కూడా ఈ ఇద్దరు ఏ మాత్రం తగ్గేవారు కాదు. ఇక ఒకానొక సమయంలో వీరు వ్యక్తిగతంగానూ విమర్శలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇక అప్పుడు టీడీపీఅధికారంలో ఉండటంతో రోజాని అసెంబ్లీనుంచి ఒక సంవత్సరం పాటు కూడా సస్పెండ్ చేశారు. ఇక ఇప్పుడు వైసీపీఅధికారంలోకి వచ్చింది. రోజామళ్ళీ ఎమ్మెల్యేఅయ్యారు. అనితటీడీపీనుంచి పోటీ చేసి ఓడిపోయారు.



అయితే తాజాగా కరోనాపై రాజకీయం జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు ఏపీలో ఉండకుండా, కనీసం కుప్పంలో కూడా ఉండకుండా హైదరాబాద్‌లో కూర్చోని  ఏపీనుంచి అమెరికావరకు సలహాలు ఇవ్వడం దురదృష్టకరమని రోజాఎద్దేవా చేశారు. ఇక అనితకూడా వెంటనే స్పందిస్తూ... చంద్రబాబు ఎక్కడున్నారన్నది ముఖ్యం కాదని, ప్రజలకోసం పనిచేస్తున్నామా.. లేదా అన్నది ముఖ్యమని ఓ సినిమాడైలాగ్ వేశారు. పనిలో పనిగా సీఎం జగన్తాడేపల్లిలో కూర్చొని ప్రెస్‌మీట్‌లు పెట్టడం కాదని, 151 మంది ఎమ్మెల్యేల భజన చూస్తుంటే... ఏ భజన వాళ్లముందు పనికిరాదని సెటైర్ వేశారు. మొత్తానికైతే పాత శత్రువులు మళ్ళీ వరుసగా కౌంటర్లు ఇచ్చుకునేలా ఉన్నారు.

]]>

Viewing all articles
Browse latest Browse all 297540

Trending Articles