అయితే కరోనా ను కట్టడి చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.. అందులో భాగంగా లాక్ డౌన్ ను విధించింది.. ప్రజల నుంచి సోకుతున్న ఈ కరోనా ప్రభావం మనుషుల ద్వారా వ్యాపించకుండా అన్నీ చర్యలను చేపట్టింది.. ఈ మేరకు ప్రజలను ఇళ్లనుంచ్చి బయటకు రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. అయిన ప్రజలు లెక్క చేయకుండా వస్తూ కరోనా ను కౌగిలించుకున్నారు...
ప్రముఖులు కూడా వారికి తోచిన సాయన్ని సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందజేస్తున్నారు.. అయినా కరోనా వ్యాప్తి మాత్రం ఎక్కడ తగ్గలేదు.. ..అందుకే కరోనా ప్రభావాన్ని పూర్తిగా తగ్గించేందుకు ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వస్తుంది.. ఈ మేరకు జనతా కర్ఫ్యూ నీ కూడా ప్రకటించింది.. కరోనా ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ విధించింది .ఈ మేరకు ప్రజలు బయటకు రాకూడదని సూచించింది.. అయితే కరోనా ప్రభావం మరింత ముదిరింది.
ఇకపోతే ...కడప జిల్లాలో భారీ వర్షాలు ముంచేస్తున్నాయి. ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షం కురవడంతో,జిల్లాలోని పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. దీంతో విద్యుత్సరఫరానిలిచిపోయింది. జోరు వానకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షం కారణంగా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది.దీంతో ప్రజలు చీకటిలో బిక్కు బిక్కు మంటూ బ్రతుకుతున్నారు. నిత్యావసర సరుకులు కొనడానికి బయటకు వెళ్లలేకపోతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కరోనా ప్రభావం ఒకవైపు పీడిస్తుంటే, మరో వైపు జోరు వానలు కురుస్తుండటంతో కరోనా ప్రభావం మరింత పెరుగుతుందేమో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరో రెండు రోజుల పాటు ఈ పరిస్థితి కొనసాగనుందని వాతావరవరణ శాఖా సమాచారం. ...
]]>