ముఖ్యంగా న్యూయార్క్నగరంలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇప్పటి వరకు దాదాపు 1600 మందికి పైగా మరణించారు. ఇటలీలో రోమ్ నగరంలో కూడా పరిస్థితులు మరీ దిగజారుతున్నాయి. బ్రిటన్ లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. అదే స్థాయిలో అక్కడ మరణాలు కూడా నమోదు అవుతున్నాయి. దాదాపు ఏడు వేల మంది కరోనా వైరస్వల్ల చనిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో మన దేశంలో కూడా కరోనా వైరస్కేసులు ఉన్న కొద్దీ పెరుగుతున్నాయి.
దాదాపు 6 వేలకు పైగానే కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 200 కి చేరువలో మరణాలు ఉన్నాయి. అయితే మన దేశంలో లాక్ డౌన్ ని పక్కగా అమలు చేయడంతో మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉంది. అన్ని చోట్ల పాజిటివ్ మరియు మరణాల సంఖ్య స్పష్టంగా ఉన్నా రికవర్ నెంబర్ సంఖ్య సరిగ్గా అంచనా ఏ దేశంలో లేకపోవటంతో అందరూ అటు ఇటు గా ఉన్నారు. ఈ నేపథ్యంలో మరణాల రేటు సంఖ్య తగ్గి రికవరీ రేటు సంఖ్య పెరిగితే కచ్చితంగా ప్రపంచం మొత్తం హ్యాపీ గా ఉంటుందని...రికవరీ రేటుకు తగ్గ వైద్యం ఏ దేశంలో ఇప్పటివరకు స్పష్టత రాలేదని చాలామంది అంటున్నారు.
]]>