వైద్యులకు పీపీఈ కిట్లు అందించడం లేదని విపక్ష టీడీపీఆరోపిస్తోంది. ఇలాంటి సమయంలో సీఎం జగన్డాక్టర్లకు ఓ శుభవార్త చెప్పారు. ఏపీ ప్రభుత్వం కోవిడ్ నియంత్రణా చర్యల కోసం పెద్ద ఎత్తున మెడికల్ ఫెసిలిటేషన్స్ అందిస్తోందని తెలిపారు. రాష్ట్రంలో 74,365
పీపీఈ కిట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అంతే కాకుండా N95 మాస్కులు 67,459 అందుబాటులో ఉన్నాయట. ట్రిపుల్ లేయర్ మాస్కులు 14 లక్షలకు పైగా తెప్పించారట.
ప్రస్తుతం రాష్ట్రంలో టెస్టింగ్ కిట్స్ 7380 వరకూ ఉన్నాయని వైసీపీచెబుతోంది. మన రాష్ట్ర జనాభానిష్పత్తిలో చూస్తే ఇవి తగినంత ఉన్నాయనే నిపుణలు చెబుతున్నారని వైసీపీఅంటోంది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు, వారికి చికిత్స అందిస్తున్న డాక్టర్లు, వైద్యసిబ్బంది ఆధారంగా చూస్తే అవసరమైన మేరకు సరిపోయేలా వీటిని అందిస్తున్నారని నిపుణులు చెబుతున్నారట.
ఇప్పటికే ప్రపంచ దేశాలన్నీ కోవిడ్ చికిత్సల కోసం అవసరమైన మందులకోసం భారత్వైపు చూస్తున్నాయి. ఇక మెడికల్ కిట్స్ కోసం భారత్‌లోని అన్ని రాష్ట్రాలు ఏపీవైపు చూసే రోజు కూడా దగ్గరలో ఉందని వైసీపీనాయకులు చెబుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో కేంద్రం సాయంతో మొదలై నిరుపయోగంగా ఉండిపోయిన మెడిటెక్ ద్వారా కరోనా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ తయారు చేయించిన ఏపీప్రభుత్వం త్వరలో వివిధ రాష్ట్రాలకూ వీటిని సప్లై చేయగల స్థాయిలో ఉత్పత్తి చేస్తుందనడంలో సందేహం లేదంటున్నారు వైసీపీనాయకులు.
]]>