అంతేకాకుండా జూనియర్డాక్టర్ల చేత శస్త్ర చికిత్సలు చేయిస్తున్నారని.. ప్రసూతి నిపుణురాలిని ఇంతవరకు నియమించలేదని అన్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈ విషయం మొత్తం ఏపీవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారడం తో వెంటనే ప్రభుత్వం ఓ విచారణ కమిటీ వేసింది. అసలు ఆ డాక్టర్చేసిన ఆరోపణల్లో వాస్తవం ఉందో లేదో ఆసుపత్రి మొత్తం పరీక్షించి విచారణ చేసి రిపోర్ట్ ఇవ్వాలని తెలిపింది.
అయితే ఆ తర్వాత డాక్టర్సుధాకర్ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులతో మాట్లాడిన తర్వాత టీడీపీడైరెక్షన్ లో ఈ వ్యాఖ్యలు చేసినట్లు మొత్తం తతంగమంతా బయటకు రావడంతో ఏపీప్రభుత్వం డాక్టర్సుధాకర్ని సస్పెండ్ చేస్తూ వైద్య విధాన పరిషత్ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో డాక్టర్సుధాకర్పై ప్రభుత్వం వేసిన సస్పెన్షన్ చాలా పెద్దదని ఈ దెబ్బతో డాక్టర్సుధాకర్కి గుణపాఠం రావడం గ్యారెంటీ అని...వైద్యుడిగా ఉంటూ ప్రజలకు ధైర్యం చెప్పాల్సిన వ్యక్తి లేనిపోని రాజకీయాల్లో దూరితే ఇలా ఉంటుంది అని గుణపాఠం బాగా అర్థమయ్యే ఉంటుంది అని చాలామంది అంటున్నారు.
]]>