లాక్‌డౌన్ పూర్తయ్యే వరకు ప్రతిరోజూ ఒక పేరుతో దీపాలు వెలిగిస్తానని హిమాన్షు ప్రకటించారు. తొలిరోజు ఆదివారం కిల్ కరోనా, రెండోరోజు సోమవారం విన్ కరోనా, మూడోరోజు మంగళవారం లీవ్‌కరోనా అని రాసి ఉన్న అక్షరాలపై దీపాలు వెలిగించారు. ఈ సందర్భంగా దేశంలో కరోనా అంతం కావాలంటూ ఆకాంక్షించిన హిమాన్షు.. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.
కరోనాపై పోరులో భాగంగా, ఏప్రిల్ 5 ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రతీ ఒక్కరూ ఇంట్లోని అన్ని లైట్లూ ఆపివేయాలని ప్రధానిపిలుపునిచ్చారు. తొమ్మిది నిమిషాల పాటు.. కొవ్వొత్తి లేదా దీపం లేదా మొబైల్ ఫ్లాష్ లైట్, టార్చ్ వేయాలని దీంతో ఎవరూ ఒంటరిగా లేమని ధైర్యం చెప్పుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఎవరూ బయటకు రాకుండా.. కేవలం ఇంట్లో కూర్చొని ఈ పని చేయాలని.. కరోనాపై విజయానికి నాందిగా దీనిని జరపాలని’ ప్రధానిమోదీచెప్పారు. అందరూ ప్రతీ ఒక్కరూ సామాజిక దూరం (భౌతిక దూరం) పాటించాలని పిలుపునిచ్చారు. అలాగే.. శానిటైజర్ రాసుకుని దీపాలు వెలిగించొద్దని కూడా ఆయన చెప్పారు. ఓ వైపు ప్రధాని మోదీపిలుపునకు విశేష స్పందన రావడం, తాజాగా సీఎం కేసీఆర్తనయుడు హిమాన్షు తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా మోదీజీని ఖుష్ చేసేవని అంటున్నారు.
]]>