టీం ఇండియాస్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీసినిమాలో పెట్టుబడి పెట్టాలని ఒక నిర్మాణ సంస్థను స్థాపించాలి అని భావిస్తున్నాడు. తనకు సినిమానిర్మాతగా మారాలి అనే ఆసక్తి ఎక్కువగా ఉందని అందుకే సినిమాలు చెయ్యాలని చూస్తున్నాడని సమాచారం. ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేసినా సరే అది సాధ్యం కావడం లేదని ఇప్పుడు తన భార్యతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ సినిమాఎవరి తో చేసే అవకాశం ఉంది అనేది స్పష్టత రావడం లేదు. అయితే సల్మాన్ ఖాన్‌తో అని అంటున్నారు.
సల్మాన్ఇప్పుడు విరాట్‌తో సినిమాచేయడానికి రెడీ కూడా అయినట్టు తెలుస్తుంది. గతంలో వీరి మధ్య అనుష్కశర్మ కారణంగా విభేదాలు వచ్చాయని ప్రచారం జరిగింది. కాని ఇప్పుడు అది నిజం కాదని అంటున్నారు. అనుష్కశర్మ కూడా కోహ్లికి సహాయం చేస్తుందని అంటున్నారు. ఇప్పటికే తన మేనేజర్ కి కోహ్లి కొన్ని సలహాలను కూడా ఇచ్చినట్టు సమాచారం. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ సినిమావచ్చే ఏడాది మొదలు కానుంది. అయితే ఈ సినిమాబడ్జెట్ మాత్రం ఒక్కడే పెట్టకుండా మరో నిర్మాతతో కలిసి పెట్టే ఆలోచనలో ఉన్నాడని సమాచారం.
]]>