Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 305672

అన్నాదమ్ముల మధ్య నలుగుతున్న ఆ కథేంటి..?

$
0
0
చిరంజీవి ఇష్టపడి కొనుక్కున్న కథను పవన్ముచ్చటపడి అడిగితే... ? చిరంజీవిచేయాల్సిన సినిమాపవర్ స్టార్పవన్ కల్యాణ్చేస్తే.. ? ప్రస్థుతం ఇదే నడుస్తోంది సోషల్ మీడియాలో.  మెగాస్టార్ రీమేక్చేద్దామనుకున్న లూసిఫర్ రీమేక్మూవీని పవర్ స్టార్చేస్తానన్నాడా..? తమ్ముడు అడిగితే  చిరంజీవి ఇచ్చేస్తాడా...?

 


మెగాస్టార్ చిరంజీవిమోహన్ లాల్నటించిన మలయాళ సూపర్ హిట్ మూవీలూసీఫర్ హక్కులను తీసుకున్నాడు. ప్రస్థుతం కొరటాలశివసినిమాచేస్తున్న చిరు.. ఆ తరువాత లూసీఫర్ కథలో మార్పులు చేయించి.. తాను రీమేక్చేయాలని ప్లాన్ చేసుకున్నాడు. అయితే సోషల్ మీడియాలో ఈ కథను పవర్ స్టార్పవన్ కల్యాణ్చేయబోతున్నట్టు న్యూస్ వైరల్ అవుతోంది.


 


ప్రస్థుతం వకీల్ సాబ్ తో పాటు క్రిష్ సినిమాలతో బిజీగా ఉన్నాడు పవన్‌ కల్యాణ్.. ఆ తరువాత హరీష్ శంకర్తో కూడా సినిమాచేయబోతున్నాడు. ఇన్ని సినిమాలతో బిజీగా ఉన్న పవన్ .. లూసీఫర్ కూడా చేస్తున్నాడు అన్న న్యూస్ హల్ చల్ చేస్తోంది. దీనీపై మెగాస్టార్ను కదిలిస్తే.. అలాంటిదేమి లేదు.. ఈ కథ నేనే చేస్తున్నాను అని చెప్తూ.. పవన్ కు ఈ స్టోరీ నచ్చితే, చేయాలని ఉంటే ఇచ్చేస్తాను అన్నారు.


 


లూసీఫర్.. మూవీపొలిటికల్ బ్యాగ్రౌండ్ తో నడిచే కథతో రూపొందింది. బాలీవుడ్స్టార్ హీరోవివేక్ఓబెరాయ్ కూడా లీడ్ క్యారెక్టర్ లో నటించాడు. అయితే ఇప్పుడు పవన్ కల్యాణ్పాలిటిక్స్ లో యాక్టీవ్ గా ఉన్నాడు. లీడర్పాత్రలో మెరిపించగలడు పవన్.. ఫ్యాన్స్ కూడా పవర్ స్టార్నుంచి ఇదే ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.


 


చిరంజీవి చెయ్యాలనుకున్న ఈ కథను  పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చిరు నుంచి  తీసుకుంటాడా ?ఇప్పుడు ఉన్న మూడు సినిమాల తరువాత ఈ మూవీపై దృష్టి పెడతాడా.. ? మరిముందే ఖర్చీఫ్ వేసుకున్నచిరంజీవే ఈ సినిమాచేస్తానంటాడా అన్నది మాత్రం తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సిందే.

]]>

Viewing all articles
Browse latest Browse all 305672

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>