ఒక పక్క కరోనా ప్రపంచాన్ని పీల్చి పిప్పిచేస్తుంటే మరో పక్క గాలిమరియు వడగండ్ల వానలు రైతులను కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి . రైతు తనపంట చేతికి వచ్చిందన్న సంతోషంతో ఆనందించే లోపు పంటపొలాలను నాశనం చేస్తూ వరుణుడు ఆనందిస్తున్నాడు . గురువారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకూ ఏపీలో భారీ గాలులతో కూడిన వర్షాలు పడ్డాయి. కర్నూలు జిల్లాలో అధికశాతం వర్షపాతం నమోదు కబడ్డాయి . నెల్లూరు లో భారీ వర్షప్రభావానికి అపార పంట నష్టం మరియు దీనికి తోడు ఉరుములు మరియు మెరుపుల కారణంగా దాదాపుగా 14 మంది మృత్యువాత పడ్డారు. కృష్ణాజిల్లాలో నలుగురు, గుంటూరు జిల్లాలో ఇద్దరు, ప్రకాశం, జిల్లాలో ఒకరు అదేవిధంగా నెల్లూరు లో 7 మంది కలిపి మొత్తం 14 మంది ప్రాణాలను కోల్పోయారు .
ఈ నష్టాన్ని పూరించామని ఏపీ రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు . అదేవిధంగా ఇప్పటివరకు 140 కరోనా హాట్ స్పాట్ లను గుర్తించారు . ఈ సందర్భంగా సీసీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణరెవెన్యూ శాఖ మంత్రిపిల్లి సుభాష్ చంద్రబోస్‌కు లేఖరాశారు. మృతుల కుటుంబాలకు కనీసం 10 లక్షల నష్టపరిహారాన్ని చెల్లించవలసినది కోరారు . అదేవిధంగా త్వరితగతిన పంట నష్టాన్ని అంచనావేసి పంట నష్టాన్ని చెల్లించవలసినది గా ప్రభుత్వానికి ఆ లేఖలో కోరారు
]]>