అయితే బిగ్ బాస్ 3తో శ్రీముఖిపాపులారిటీ కూడా బాగానే పెరిగిపోయింది.. ఈ అమ్మడికి ఇక సినిమాల్లో వరుస ఛాన్సులు వస్తాయని భావించారు. అయితే శ్రీముఖిమాత్రం ఇప్పటి వరకు పెద్దగా ఏ సినిమాల్లో ఛాన్సులు దక్కించుకున్నట్లు కనిపించడం లేదు.. తిరిగి బుల్లితెరపైనే ఫోకస్ పెట్టింది. 'జులాయి' సినిమాలో అల్లు అర్జున్చెల్లెలుగా కూడా నటించింది. ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉండిపోయింది. ఆమె సినిమాలకు దూరం కావడం అభిమానులను కూడా నిరాశపరించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘జులాయి’ మూవీచేస్తున్నప్పుడే సినిమాలు వద్దని మా నాన్నచెప్పారని.. ఇదే నీ చివరి మూవీకావాలని అన్నారు. విచిత్రం ఏంటంటే తర్వాతనే నాకు వరుసగా ఛాన్సులు రావడం మొదలు పెట్టాయి.
రెండుమూడు సినిమాల్లో నటించిన తర్వాత వాటికి ఫుల్ స్టాప్ పెట్టి, టీవీషోలతో బిజీ అయ్యానని తెలిపింది. టీవీషోలు చేస్తుంటే, సినిమాఅవకాశాలు రావని డైరెక్టర్త్రివిక్రమ్ శ్రీనివాస్కూడా చెప్పారని... ఆయన చెప్పినట్టుగానే జరిగిందని వెల్లడించింది. కానీ రెండు మూడు సినిమాల్లో ఆఫర్ వచ్చిందని.. ఎక్స్ పోజింగ్, లిప్ లాక్ సీన్లు చేయాలని అడగడం వాటికి నో చెప్పానని అన్నారు. అలాంటివి చేయడం మన వల్ల కాదనే సినిమాలు వదులుకున్నానని తెలిపింది.
]]>