Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 297578

అల్లు అర్జున్ చేసిన సహాయాన్ని కేరళ ప్రజలు ఎన్నటికీ మరవరు : కేరళ సీఎం ప్రశంసలు

$
0
0

ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడ చూసినా కరోనా మహమ్మారి కమ్మేసిందని అందరికీ తెలిసిన విషయమే. అందులోనూ మన దేశంలో రోజురోజుకీ చాపకింద నీరులా కరోనా వైరస్సోకుతుంది. మొన్నటి వరకు  తెలుగు రాష్ట్రాల్లో తక్కువగా ఉన్న కరోనా చిన్న చిన్నగా పెరుగుతూ వెళుతుంది. ఈ విపత్తు నుండి బయటపడడానికి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు వారి స్తోమతకు మించి ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రభుత్వానికి తోడుగా బయటి నుంచి కొందరు వ్యాపారస్తులు అలాగే సినీ వర్గాలకు చెందిన కొందరు ప్రముఖులు ఎవరికీ తోచినంత వారు సహాయం చేస్తూ ఉన్నారు.




ఇలా మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అనేకమంది వారి వారి స్తోమత తగ్గట్టు వారు విరాళాలు అందజేశారు. ఇక అసలు విషయానికి వస్తే హాలీవుడ్స్టైలిష్ స్టార్అల్లు అర్జున్మన రెండు తెలుగు రాష్ట్రాల కాకుండా పక్కన ఉన్న కేరళరాష్ట్రానికి కూడా తన వంతు 25 లక్షల సహాయాన్ని అందించారు. ఈ మొత్తాన్ని కేరళసీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళంగా ప్రకటించారు. అయితే ఇక్కడ ఏమి కొత్తగా ఉంది అనుకుంటున్నారా..? 25 లక్షల విరాళాన్ని ఇచ్చినందుకు కేరళరాష్ట్రంలో అల్లు అర్జున్ని ప్రత్యేకంగా అభినందించింది కేరళసర్కార్. 




తెలుగు రాష్ట్రాలతో పాటు సమానంగా తమని రాష్ట్రాన్ని కూడా ఆదుకోవాలన్న బన్నీఆలోచన చాలా గొప్పదంటూ స్వయంగా కేరళసీఎం పినరయి విజయన్అల్లు అర్జున్అభినందించారు. బన్నీరెండు తెలుగు రాష్ట్రాలకు చెరో 50 లక్షలు ఇవ్వగా కేరళసీఎం రిలీఫ్ ఫండ్ కి పాతిక లక్షలు అందజేశారు. దీనితో తమకు అందిన సహాయాన్ని గుర్తించిన కేరళసర్కార్ బన్నీచేసిన సహాయాన్ని కేరళప్రజలు మర్చిపోరు అని ఈ ఆపత్కాలంలో మద్దతుగా నిలిచినందుకు అర్జున్కి ఎప్పుడు రుణపడి ఉంటామని కేరళసీఎం పినరయి విజయన్తెలిపారు. నిజానికి అల్లు అర్జున్కి ఒక తెలుగులో మాత్రమే కాకుండా మలయాళ ప్రేక్షకుల్లో కూడా తెలుగులో ఎంత మంది అభిమానులు ఉన్నారో మలయాళంలో కూడా అంత మంది అభిమానులను సంపాదించుకున్న ఏకైక తెలుగు యాక్టర్ అల్లు అర్జున్మాత్రమే. నిజానికి అల్లు అర్జున్సినిమారిలీజ్ అవుతుంది అంటే కేరళలో పెద్ద పండుగచేస్తారు.

]]>

Viewing all articles
Browse latest Browse all 297578

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>