మనిషి వెంట్రుకలో వెయ్యోవంతు లేని క్రిమి కోట్ల మందిని శాసిస్తూ వేదాంతం చెపుతోంది. ప్రపంచ నియంత నలుగురుని కలవవద్దు అంటూ శాసిస్తే పట్టించుకోని ప్రజలు ఒక వైరస్ కు భయపడి ఎవరి ఇళ్ళల్లో వారు దాక్కోవడం చరిత్రమరిచిపోలేని సంఘటన. దేవుడు పటం దగ్గర కూర్చుని ఈరోజు చాలామంది శ్రీకంచి కామకోటి పీఠాదిపతి శ్రీ శంకర్విజయేంద్ర సరస్వతి స్వామి సంకలన పరిచిన ‘రోగ నివారణ’ శ్లోకాన్ని ఈరోజు మనదేశంలో చాలామంది రోజుకు 36 సార్లు నుండి 1008 సార్ల వరకు పఠించే వారిసంఖ్య కుదరకపోతే వినే వారి సంఖ్య పెరిగిపోతూ ఉంది అంటే ఈ కరోనా నుండి రక్షించే శక్తిఒక్క అమ్మకు మాత్రమే ఉంది అన్న సత్యం అందరికీ తెలిసి వచ్చేలా పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఈ పరిస్థితుల నుండి మనం బయటపడాలి అంటే ఇతరులకు మనం చేయగలిగిన మంచి గురించి ఆలోచించాలి అంటూ ఈరోజు జరుగుతున్న గుడ్ ఫ్రైడే సందర్భంగా పోప్ ఫ్రాన్సిస్ పిలుపు ఇచ్చారు అంటే ప్రపంచంలోని అన్ని మతాలు కరోనా తో యుద్ధం చేయలేక కనిపించని దైవ శక్తిపై ఎలా ఆధారపడి పోతున్నాయో అర్థం అవుతుంది. ప్రస్తుతం ఎవరు గతం వర్తమానం భవిష్యత్ గురించి ఆలోచించే శక్తిలేక మహమ్మారి చెప్పిన మహాసత్యం ‘ప్రకృతిని కాపాడితేనే మన మనుగడ’ అన్న సత్యాన్ని గుర్తించి ఇప్పటికే 100 రోజులలో 93,637 మంది ప్రాణాలు తీసిన ఈ కరోనా రానున్న రోజులలో ఎన్ని ప్రాణాలు తీస్తుందో అన్న భయాలతో రోజులు గడుపుతున్న పరిస్థితులలో ఇప్పటికైనా ఈ మహమ్మారిని శాంతించమని ఆ దేవుడుని ప్రార్దిద్దాం..