Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 305677

విజయం మీదే: ఈ ఆరు లక్షణాలు మీలో ఉంటే విజయం మీ సొంతం

$
0
0
మన జీవితంలో చాలా సందర్భాల్లో మనుషులందరూ సమానమనే మాటను వింటూ ఉంటాం. కానీ సక్సెస్విషయంలో మాత్రం మనుషులందరూ సమానం కానే కాదు. నిజ జీవితంలో ప్రతి రంగంలో పది శాతం మంది మాత్రమే విజేతలుగా ఉంటారు. ఇతరుల కన్నాభిన్నంగా ఆలోచించిన వారే విజేతలుగా నిలిచి ఉంటారు. ముఖ్యంగా ఆరు లక్షణాలు ఉన్నవారు మాత్రమే విజేతలుగా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 
 
మొదటిది... విజేతలు శ్రమను నమ్ముకొని పనినే దైవంగా భావిస్తారు. పని చేస్తే మాత్రమే ఫలితం ఉంటుందని బలంగా నమ్ముతారు. ఎన్నో గొప్ప ఆలోచనలు ఉన్నా పని చేయనిదే ఏ ఫలితం రాదని విశ్వసిస్తారు. రెండవది... వీరు ఫలితం కంటే ప్రధానంగా జ్ఞానంపై దృష్టి పెడతారు. ఇతరుల నుంచి కొత్త విషయాలను నేర్చుకుంటూ నిత్యవిద్యార్థిలా ఉంటారు. మూడవది.... వీరు ఎల్లప్పుడూ పనిలోనే ఆనందాన్ని వెతుక్కుంటారు. ఇతరుల మాటలను పట్టించుకోకుండా పోటీదారుల కన్నా, సహచరుల కన్నాఎక్కువగా కష్టపడతారు. 
 
నాలుగవది.. వీరు రిస్క్ తీసుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుందని ఎల్లప్పుడూ భావిస్తూ ఉంటారు. అవకాశాల కోసం అవసరమైన మేరకు రిస్క్ తీసుకుని సక్సెస్సాధిస్తారు. ఐదవది... వీరు చేసే ప్రతి పనిని సృజనాత్మకతతో చేయడానికి ప్రయత్నిస్తారు. కొత్తగా ఒక పనిని ఏ విధంగా చేయవచ్చో శోధించి ఎంచుకున్న లక్ష్యాలను సాధిస్తారు. ఆరవది... వీరు ఎల్లప్పుడూ ఇతరులను ప్రేమిస్తారు. సలహాలను, సమాచారాన్ని ఇతరులకు ఇస్తూ వారి విజయంలో భాగస్వాములవుతారు. ]]>

Viewing all articles
Browse latest Browse all 305677

Trending Articles