Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 297578

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి.. !

$
0
0
యావత్‌ ప్రపంచాన్ని కరోనా వైరస్‌ పట్టిపీడిస్తోంది. ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి ప్రపంచ దేశాలు చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలితమివ్వడం లేదు. దీంతో కరోనా బాధితుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతోంది. గడిచిన 24 గంటల్లోనే సుమారు 75 వేల మంది కరోనా బారిన పడ్డారంటే... వైరస్‌ విజృంభణ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

 
కరోనా మహమ్మారికి భయపడి జనం ఇళ్లలోకి దూరి తలుపులు మూసుకుంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి. కానీ ఏం లాభం... చాలా మంది దాని బారినుంచి తప్పించుకోలేకపోతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా... ఏదో ఒక రూపంలో వైరస్‌ సోకడం వల్ల ఆస్పత్రులపాలవుతున్నారు. కొందరు అభాగ్యులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. 



 
ప్రపంచ వ్యాప్తంగా ఇంత వరకూ సుమారు 16 లక్షల మంది కరోనా బారిన పడ్డారు. గడిచిన 24 గంటల్లోనే దాదాపు 80 వేల మందికి సోకింది వైరస్‌. అంతేకాదు... ఈ మహమ్మారి బారిన పడి ఇంత వరకూ దాదాపు లక్ష మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో గత 24 గంటల్లోనే 7 వేల మందికిపైగా చనిపోయారు.



ప్రపంచ వ్యాప్తంగా కరోనా బారిన పడిన వాళ్లలో సుమారు మూడున్నర లక్షల మంది కోలుకున్నారు. ప్రస్తుతం పదకొండున్నర లక్షల మంది చికిత్స పొందుతున్నారు. అందులో సుమారు 50 వేల మంది పరిస్థితి విషమంగా ఉంది.


 
 
కరోనా కేసుల్లో అమెరికామొదటి స్థానంలో ఉంది. అక్కడ దాదాపు 5 లక్షల మంది కరోనా బారినపడ్డారు. ఇందులో దాదాపు 50 వేల వరకూ కొత్త కేసులు. అలాగే, అమెరికాలో ఇంత వరకూ కరోనాతో 27 వేల మంది చనిపోగా, గడిచిన 24 గంటల్లో 17 వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం అమెరికాలో 4 లక్షలకు పైగా కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు. వీళ్లలో దాదాపు 10 వేల మంది పరిస్థితి విషమంగా ఉంది. అమెరికాలో ఇంత వరకూ 23 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.



  
స్పెయిన్‌, ఇటలీ, ఫ్రాన్స్‌, జర్మనీల్లో కూడా కరోనా వైరస్‌ ఉధృతంగానే వ్యాపిస్తోంది. స్పెయిన్‌లో ఇంత వరకూ లక్షా 50 వేల మంది కరోనా బారిన పడగా, ఇందులో దాదాపు 5 వేల కొత్త కేసులు. అలాగే, 16 వేల మరణాలు సంభవించగా, సుమారు 500 మంది గత 24 గంటల్లోనే చనిపోయారు. ఇటలీలో దాదాపు లక్షన్నర మంది కరోనా బారిన పడితే... అందులో 4 వేలకు పైగా కొత్త కేసులు. అదే విధంగా ఇటలీలో మొత్తం మరణాలు 18 వేలు దాటగా, ఒక్క రోజు వ్యవధిలోనే 800 మరణాలు రికార్డయ్యాయి.



ఫ్రాన్స్‌లో కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. అక్కడ 5 వేల కొత్త కేసులతో కలుపుకుని... కరోనా బాధితుల సంఖ్య లక్ష 18 వేలకు చేరువలో ఉంది. ఫ్రాన్స్‌లో 12 వేల మందికి పైగా చనిపోగా, ఒక్క రోజు వ్యవధిలో దాదాపు 14 వందల మంది మరణించారు. జర్మనీలో కూడా కరోనా విజృంభిస్తోంది. జర్మనీలో కరోనా బాధితుల సంఖ్య లక్షా 15 వేలు దాటింది. ఇందులో 2 వేలకు పైగా కొత్త కేసులు. జర్మనీలో ఇంత వరకూ దాదాపు 2 వేల 500 మంది కరోనాతో చనిపోతే... గడిచిన 24 గంటల్లో వందకు పైగా మరణాలు నమోదయ్యాయి. జర్మనీలో ఇంత వరకూ 13 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించింది అక్కడి ప్రభుత్వం.



కరోనా పుట్టినిల్లైనా సరే... పాజిటీవ్‌ కేసుల పరంగా మాత్రం ఇప్పుడు ఆరు స్థానంలో ఉంది చైనా. అక్కడ కొత్త కేసులు బాగా తగ్గిపోయాయి.

]]>

Viewing all articles
Browse latest Browse all 297578

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>