కాదేది శానిటైజర్స్ చేయడానికి అనర్హం అని అనుకున్నాడొక పోలీస్అధికారి. మందు తో శానిటైజర్స్ చేస్తుంటే ఆల్కహాల్ కంటెంట్ ఉన్న కల్లు తో శానిటైజర్స్ చేయలేమా అని ఆలోచన చేశాడు. అంటే అనుకున్నదే తడవుగా పని మొదలు పెట్టాడు. ఇండోనేషియాలోని బాలిలో ఈ కల్లు శానిటైజర్స్ తయారయ్యింది. బాలి పోలీస్చీఫ్ దీనికి ఆద్యుడు. ఆలోచన రాగానే తాటికల్లు తీసే వారివద్దకి వెళ్లి కొంత మేర కల్లు తీసుకున్నాడు..
అలా సేకరించిన కల్లు ని స్థానికంగా ఉన్న ఉదయన యూనివర్సిటీనిపుణులకి ఇచ్చి శానిటైజర్స్ గా మార్చమని అడిగాడు. వారు కేవలం వారం రోజుల్లోనే సహజంగా దొరికే శానిటైజర్స్ కంటే కూడా అత్యంత మేలిమి శానిటైజర్స్ 90% ఆల్కహాల్ తో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణల మేరకు తయారు చేశారు. ఇందులో ఆయుర్వేదఉత్పత్తులు కూడా వేసి సుమారు 20 బాటిళ్ళు సిద్దం చేశారు. త్వరలో ప్రభుత్వ ఆమోదం మేరకు అందరికి అందుబాటులోకి రానున్నాయట.మరి మన వాళ్ళు కూడా కల్లు తో శానిటైజర్స్ కోసం ప్రయత్నాలు చేస్తారేమో వేచి చూడాలి.
]]>