ఉన్నతాధికారుల ప్రకటనతో హైదరాబాద్-విజయవాడ మధ్య రానుపోను భారీగా టికెట్లు బుక్కైపోయాయి. అలాగే హైదరాబాద్నుండి ఏపిలోని వివిధ ప్రాంతాలతో పాటు ఏపిలోని అనేక ఊర్ల నుండి హైదరాబాద్కు టికెట్లను జనాలు బుక్ చేసుకున్నారు. ప్రయాణీకులు టికెట్లు బుక్ చేసుకోవటం అయిపోయిన తర్వాత ఇపుడు ఆ టికెట్లన్నింటినీ క్యాన్సిల్ అంటున్నారు ఉన్నతాధికారులు. లాక్ డౌన్ కాలంలోనే ఏప్రిల్ 14 తర్వాత ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో తెలీకుండానే అసలు ఆర్టీసీఉన్నతాధికారులు టికెట్లను ఎలా జారీ చేశారో అర్ధం కావటం లేదు.
టికెట్లను బుక్ చేసుకోవటంలో అసలు ఆర్టీసీకి ఇందుకింత తొందర ? అసలు లాక్ డౌన్ ఎందుకు విధించారో ఉన్నతాధికారులకు తెలీదా ? లాక్ డౌన్ పీరియడ్ లో కూడా ఒకవైపు కరోనావైరస్తీవ్రత పెరిగిపోతున్న విషయం ఉన్నతాధికారులు చూడటం లేదా ? ఒకవైపు కేసుల సంఖ్య పెరిగిపోతుంటే మరోవైపు లాక్ డౌన్ ఎత్తేస్తారని ఎలా అనుకున్నారు. రైలు టికెట్ల విషయంలో ఐఆర్సీటిసి ప్రకటననే ఆర్టీసీఉన్నతాధికారులు ప్రామాణికంగా తీసుకున్నట్లున్నారు.
లాక్ డౌన్ ఎత్తేయాలా ? లేకపోతే కంటిన్యు చేయాలా ? అనే విషయాన్ని డిసైడ్ చేయాల్సింది ఐఆర్సీటిసి కాదు కదా ? ఇపుడు ఆర్టీసీఓపెన్ చేసిన బుకింగ్ లో 42,377 టికెట్లు బుక్కయ్యాయి. వీటిల్లో హౌదరాబాద్-విజయవాడ మధ్యే సుమారు 7 వేల టికెట్లున్నాయి. ఏప్రిల్ 15వ తేదీన 27, 247 టికెట్లు, 16న 11,305, 17న 2542, 18న 791, 19వ తేదీన 431, 20 61 టికెట్లు బుక్కయ్యాయి. ఇపుడు వాటన్నింటినీ ఉన్నతాధికారులు క్యాన్సిల్ చేసేస్తున్నారు. ఎందుకు బుక్ చేసినట్లు ? ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నట్లు ?
]]>