ఇది ఇలా ఉండగా ఎవరైనా మృతి చెందితే దహన సంస్కారాలు కూడా జరిపే పరిస్థితి కూడా లేకుండా అయిపోయింది. ఇక దహన సంస్కారాలు నిర్వహించడానికి కూడా ప్రస్తుతం స్మశాన వాటికలు కూడా దొరక లేని పరిస్థితి ఏర్పడిందంటే నమ్మండి. ఇది ఇలా ఉండగా కొంత మంది పేద వారు అయితే స్మశాన వాటికలలో ఎవరూ లేకపోవడంతో వాళ్లు మృతదేహాలను నదిలో వదిలేస్తున్నారు. అంతేకాకుండా ఎవరైనా సాధారణంగా మరణించినా కూడా వారికి వైద్య పరీక్షలు నిర్వహించి, దీనితో పాటు కరోనా పరీక్షలు చేస్తూ వారి కుటుంబ సభ్యులందరినీ కూడా క్వారంటైన్ లో ఉంచుతున్నారు. ఈ నేపథ్యంలో కొంత మంది ప్రజలు ఏమి చేయాలో అర్థం కాకుండా తమ వాళ్ల మృతదేహాలను నదిలో కనిపిస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి.
ఇందుకు సంబంధించిన సమాచారం ప్రస్తుతం అందరినీ ఆందోళన కలిపిస్తుంది అనే చెప్పాలి. ఇక దేశవ్యాప్తంగా చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఇదేవిధంగా లాక్ డౌన్ అమలు అయితే మాత్రం ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు నెలకొంటాయేమో అని అంటున్నారు కొందరు. ఇక కొన్ని ప్రదేశాలలో కుటుంబ సభ్యులకు కనీసం అస్తికలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది.