ఆ తర్వాత బాలకృష్ణ, హరికృష్ణను దగ్గరకు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు తనయుడు లోకేష్‌కు బాలయ్య కుమార్తె నారా బ్రాహ్మణికి పెళ్లినిజంగా చంద్రబాబుకు ఇష్టం ఉందా ? లేదా ? అన్నది అప్పట్లో అనేక సందేహాలు ఉన్నాయి. వాస్తవంగా భువనేశ్వరికి సోదరుడు బాలయ్య అంటే ఎంతో ఇష్టం... ఆమె పట్టుబట్టి వీరి పెళ్లికి తెరవెనక చక్రం తిప్పారన్న వార్తలు వచ్చాయి. వాస్తవంగా చూస్తే చంద్రబాబు బ్రాహ్మణిని కోడలిగా చేసుకునేందుకు చంద్రబాబు సందేహిస్తున్న టైంలోనే బాలయ్య - భువనేశ్వరి మధ్య ఉన్న అనుబంధం నేపథ్యంలో వీరు తెరవెనక చక్రం తిప్పి ఈ పెళ్లిఫిక్స్ చేశారన్న టాకే ఉంది.
అదే టైంలో అధికారం లేనిదే నిద్రపట్టని చంద్రబాబు 2009 ఎన్నికల్లో గెలుపుకోసం ఇటు బాలయ్య కుమార్తెను కోడలిగా చేసుకుని.. బాలయ్యను తన ఇంట్లో కట్టేసుకున్నారు. అలా అధికారం కోసం .. ఇటు భార్యమాట కోసం బాబు రాజీపడక తప్పలేదు. ఇక ఆ తర్వాత హరికృష్ణకు రాజ్యసభ సీటు ఇచ్చారు. చివరకు 2009 ఎన్నికల్లో ఓడిపోయాక బాలయ్య సినిమాలు చేసుకోగా.... హరికృష్ణను సైడ్ చేసేశారు. ఏదేమైనా బ్రాహ్మణి - లోకేష్పెళ్లిఖచ్చితంగా భువనేశ్వరి - బాలయ్య మధ్య ప్రేమ, అప్యాయత వల్లే జరిగిందని నందమూరి, నారా అభిమానులు ఆఫ్ ద రికార్డుగా చెపుతూ ఉంటారు.
]]>