భార్యా పిల్లలతో క్వాలిటీ టైం గడుపుతున్న తారక్ అంతేకాక ప్రొఫెషనల్ లైఫ్‌ని కూడా ఏమాత్రం నెగ్లెక్ట్ చెయ్యకుండా పనిలో పనిగా దర్శకుల నుండి కథలు కూడా వింటున్నారట. ఇప్పటికే తన 30వ చిత్రం త్రివిక్రమ్‌తో ప్రకటించేసిన ఆయన కొందరు దర్శకుల నుండి కథలు వింటూ తన 31వ చిత్రానికి ప్రణాళికలు రచిస్తున్నారట. ఇక ఎన్టీఆర్ 31వ చిత్రం కొరటాలశివతో ఉంటుందని ప్రచారం జరుగుతున్నా ఎటువంటి అధికారిక సమాచారం అయితే లేదు.
ఇక ఇదిలా ఉంటే... మరి కొరటాల మాత్రం చిరంజీవిచిత్రం తర్వాత ఇక సినిమాలు చెయ్యరని ఓ వెబ్సైట్లో వార్త వచ్చింది. మరి అది ఎంత వరకు నిజం అన్న విషయం తెలియాల్సి ఉంది. తన ఇమేజ్ కి తగ్గ మంచి కథ తీసుకువచ్చిన దర్శకుడితో కమిట్ కావచ్చనే ఉద్దేశంతో ఎన్టీఆర్దర్శకుల నుండి కథలు వింటున్నాడని సమాచారం. ఇక ఆర్.ఆర్.ఆర్కారణంగా ఎన్టీఆర్అభిమానులు ఆయనని స్క్రీన్ పై రెండేళ్లు మిస్ అయ్యారు. ఆర్.ఆర్.ఆర్వచ్చే ఏడాది జనవరి 21న విడుదల కానుంది. మరి ఆ చిత్రం అవ్వగానే మరో చిత్రం పట్టాలమీదకి ఎక్కించాలని తెగ సీరియస్‌గా కథలు వింటున్నాడు ఎన్టీఆర్.
]]>