Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 297578

100 రోజుల కరోనా : విలయం సృష్టించింది..విలువలు నేర్పించింది..!!

$
0
0
కంటికి కనిపించకుండా, ఎలాంటి ఆయుధాలు వాడకుండా, ప్రపంచాన్ని గడగడలాడించింది కరోనా  మహమ్మారి. ఇది ఉగ్రవాదుల కంటే దారుణంగా మనిషిని చంపేస్తోంది. అగ్ర రాజ్యమని విర్రవీగే అమెరికాని కేవలం నెల రోజుల వ్యవధిలో అధఃపాతాళానికి తొక్కేసింది. టెక్నాలజీముందున్నామని జబ్బలు చరుచుకునే అమెరికానే ఇప్పుడు భారత్వైపు ఆశగా చూస్తోంది. వేలాది మంది చనిపోగా , లక్షలాది మంది మృత్యువుతో పోరాడుతున్నారు. కరోనా మంచి చేసిందా..?? చెడు చేసిందా..??  ఏమి తినాలన్నా భయమే, ఏది ముట్టుకోవాలన్నా భయమే, కంటినిండా ప్రశాంతంగా పడుకుని ఎన్ని రోజులు అయ్యిందో..

IHG's Best | Time


తీవ్ర వాదులు దాడి చేస్తున్నట్టుగా , ఇళ్లలోనే బిక్కు బిక్కు మంటూ గడపాల్సిన పరిస్థితి ఎదురయ్యింది.  ఏ మూల నుంచీ ఈ మహమ్మారి అంటుకుంటుందో తెలియక తాము ఎప్పుడూ తిరిగే వీధుల్లోనే పరాయి వాళ్ళలా, తెలిసిన వాడు కనిపిస్తే ముఖం తిప్పుకుంటూ బ్రతికేస్తున్నారు గడిపేస్తున్నారు. ప్రపంచ ఆర్ధిక పరిస్థితి చిన్నాభిన్నం అయ్యింది..కోట్లాది మంది ఉద్యోగాలు గాల్లో కలిసిపోవడానికి సిద్దంగా ఉంది. అన్నం పెట్టిన చేతులు ఆకలి వేస్తోందంటూ సాయం కోసం ఎదురు చూసే దుస్తితి ఏర్పడింది. భవిష్యత్తులో ఆకలి చావులు తప్పవని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది...కేవలం 100 రోజుల్లో కరోనా ప్రపంచం ఇప్పట్లో కోలుకోలేని పెద్ద విలయాన్నే  సృష్టించింది...అంతేనా..నాణానికి ఒకవైపే చూస్తే ఎలా..కరోనా చేసింది విలయం మాత్రమేనా...


IHG


కాదు కానేకాదు విలువలు కూడా నేర్పింది. ఇంట్లో అమ్మా నాన్నా, బళ్ళో గురువుగారు, శ్రేయోభిలాషులు, వైద్యులు ప్రతీ ఒక్కరూ చేతులు కడుక్కోమని చెప్పినా వినని మనం కరోనా దెబ్బకి రోజుకి నాలుగైదు కడిగేస్తున్నాం. భారతీయ సాంప్రదాయం నమస్కారానికి ఉన్న గొప్పదనం ఏమిటో ఈ కాలం కళ్ళారా చూడగలిగింది. సనాతన ఆయుర్వేదపద్దతులన్నీ ఇప్పుడు కళ్ళకి కట్టినట్టు కనిపించాయి..అందరూ ఆచరిస్తున్నారు. భారత దేశ అమూల్యమైన సంపదలైన పసుపు, అల్లం యొక్క గొప్పదనం తెలుసుకున్నాం.


IHG't — made <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=INDIA' target='_blank' title='india-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>india</a> ...


ఉరుకులు..పరుగులు పెట్టే ఈ పోటీ ప్రపంచంలో ఎంతో కాలం తరువాత కుటుంభంతో కలిసి తీరిగ్గా కాలం గడపగాలిగాం. .భవిష్యత్తులో సమయం కుటుంభం కోసం సమయం వెచ్చించేలా ఆలోచన చేశాం. అమెరికాలో ఓ యూనివర్సిటీశాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం ఈ 100 రోజుల కాలంలో గుండెసంభందిత వ్యాధులు ఉన్న వారి సంఖ్య సగానికి సగం తగ్గిపోయిందట. అందుకు కారణం బయట ఫాస్ట్ ఫుడ్ తినక పోవడం, సిగరెట్స్, మందు తాగాక పోవడం ముఖ్యంగా కుటుంభం తో హాయిగా గడపడమేనని అంటున్నారు.


IHG


రోడ్లమీద నుంచీ ఈడ్చుకుంటూ వచ్చిన చెప్పులు, బూట్లు వగైరా అన్నీ ఇంటి బయటే విడిచి లోపలి వెళ్తున్నాం. శరీరాన్ని కాపాడేది రోగనిరోధక శక్తే అన్న విషయం చిన్న పిల్లవాడికి కూడా తెలిసింది. ముఖ్యంగా ప్రాణం విలువ తెలుసుకున్నాం. డబ్బులు లేక , తిండి లేక అలమటిస్తున్న ఎంతో మందికి సాటి మనిషిగా సాయం చేయడం నేర్చుకున్నాం. ఎక్కడికి వెళ్ళకపోయినా ప్రాణాలు పోవని, ఇంట్లోనే నెలల తరబడి ఎలా గడపచ్చో నేర్చుకున్నాం..బుర్రకి పదును పెట్టే ఎన్నో భారతీయ సాంప్రదాయ ఆటలు ఆడుకున్నాం. మన ప్రాణాలు లానే జంతుల ప్రాణాలు కూడా ఎంతో ముఖ్యమని గుర్తించాం..ముఖ్యంగా డబ్బుకంటే కూడా ప్రాణమే ముఖ్యమనే ఎన్నో విలువలని నేర్చుకున్నాం..ఒక చెడు జరిగితే దానివెనుక మంచి కూడా జరుగుతుందని అంటారు..కరోనా చెడు చేసింది..కానీ దానివెనుక మంచి కూడా వచ్చిందని కోట్లాది మంది ప్రజలు నమ్ముతున్నారు.


]]>

Viewing all articles
Browse latest Browse all 297578

Trending Articles