Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 297578

లాక్ డౌన్ ఎఫెక్ట్.... రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఏం చేస్తున్నారో తెలుసా...?

$
0
0
దేశంలో కరోనా వేగంగా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. మార్చి 2వ తేదీన తెలంగాణలో తొలి కరోనా కేసు నమోదు కాగా రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. నిన్నటివరకు రాష్ట్రంలో 473 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతూ ఉండటంతో స్వయంగా కేసీఆర్రంగంలోకి దిగి పరిస్థితులను సమీక్షిస్తున్నారు. కొత్త కేసులు నమోదు కాకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నారు. 
 
పెద్ద మనసుతో స్పందిస్తూ కేసీఆర్ప్రజల హృదయాలను గెలుచుకుంటున్నారు. రాష్ట్రంలో లాక్ డౌన్ అమలవుతూ ఉండటంతో కేసీఆర్తెల్ల రేషన్ కార్డ్ లబ్ధిదారులకు నిత్యావసర వస్తువులు, 1500 రూపాయలు అందజేశారు. వలస కూలీలకు 500 రూపాయల నగదు, 12 కేజీల బియ్యం ఇచ్చి గొప్ప మనసు చాటుకున్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందకుండా రెండు రోజులకొకసారి కేసీఆర్సమీక్ష చేస్తున్నారు. 
 
రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం 5000 కోట్ల రూపాయలైనా ఖర్చు పెడతానని చెప్పిన కేసీఆర్చెప్పిన మాట ప్రకారం ఖర్చుకు వెనుకాడకుండా కరోనా కట్టడి కోసం కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలను హాట్ స్పాట్లుగా గుర్తించి కొత్త కేసులు నమోదు కాకుండా చర్యలు చేపడుతున్నారు. వైద్య, పారిశుద్ధ్య కార్మికులకు ప్రోత్సాహకాలను ప్రకటిస్తూ వారిలో స్పూర్తిని నింపుతున్నారు. 
 
రాష్ట్రంలో ప్రజల ప్రాణాలను కాపాడుకోవడమే ప్రథమ బాధ్యత అని సీఎం భావిస్తూ లాక్ డౌన్ ను మరో రెండు వారాల పాటు పొడిగించేలా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలో అన్నపూర్ణక్యాంటీన్లను తెరిపించి పేదల ఆకలి తీరుస్తూ ఇతర రాష్ట్రాల సీఎంలకు కేసీఆర్ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ ప్రజలు కరోనా గురించి భయాందోళనకు గురి కాకుండా కేసీఆర్ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నారు. వివిధ జిల్లాల్లో కరోనా ఆస్పత్రులను ఏర్పాటు చేస్తూ ప్రజల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు.     ]]>

Viewing all articles
Browse latest Browse all 297578

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>