అమ్మ అంటే అనురాగం. అమ్మ ఆప్యాయత, ప్రేమ ముందు ఏదయినా తక్కువే. అసలు అమ్మ అంటే ఏంటి? అమ్మ మనసు ఎలాంటిది? పిల్లల కోసం ఇలాంటి త్యాగాలు చేస్తుంది అన్నదో ఒక ఉదాహరణ చెబుతాను.
.
బెంగుళూరు పట్టణం లో ఒక చిన్న గ్రామం ఉండేది.ఒక ప్రేమజంట పెళ్లిచేసుకొని అక్కడే ఒక ఇంటి నీ తీసుకొని.హ్యాపీ గా వుండే వాళ్ళు.వాళ్ళకి ఒక చిన్న బాబు.బాబు పుట్టిన వారం రోజులకు తిరిగి భార్యను బాబు ను తీసుకొని ఇంటికి బయల్దేరడు.షేర్ఆటోలో వెళ్తుంటే ఎక్కువ మంది నీఆటోలో ఎక్కెంచుకోడం వల్ల ఆటో బోర్లా పడింది. రాణి భర్త అక్కడిక్కడే చనిపోయాడు.ఒక్క సారిగా తన జీవితం తలకిందులు అయిపోయింది.చేతిలో వారం రోజుల పసి బాబు.ఎవరికీ చేప్పుకోవాలో తెలియలేదు.ఎదురించి ప్రేమపెళ్ళి చేసుకుంది ఎవరు లేని ఒంటరి అయిపోయింది.
అక్కడక్కడా ఇంటి పనులు చేసుకుంటూ అల్లారు ముద్దుగా చూసుకొనేది.అదే ఊరిలో ఉండే స్కూల్మాస్టర్సహాయంతో గురుకుల పాఠశాలలో చేర్పించి తను నెల నెల మాస్టారు తో పలహరాలు,డబ్బులు పంపేది..మాస్టారు నీ వచ్చిన ప్రతిసారి అమ్మ ఎందుకు రాదు, నేనంటే తనకు అసలు పట్టింపు లేదు, అందరు పిల్లల్ని చూడ్డానికి ,మాట్లాడటానికి వాళ్ళ అమ్మ నాన్నలు వస్తారు కాని అమ్మ రాదు.నేను ఇంటికి వచ్చిన వారానికే మళ్లీ మా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళమంటుందు ఎందుకు అని మాష్టారు గారిని అడిగేవాడు రవి.
మాస్టారు ఎదో ఒకటి చెప్పి తనకు సర్ధి చెప్పేవాడు.రవి చదివి పెద్దవాడు అయ్యాడు.చిన్న వయసులోనే మంచి ఉద్యోగం తెచ్చుకొని స్థిర పడ్డాడు. కాని చిన్న వయసులోనే తన తల్లి పై పెంచుకున్న ద్వేషం తనతో పాటు పెరిగి కొండంత గా పెరిగిపోయింది.దానికి కారణం లేక పోలేదు, గుడ్డి ది ఒంటరిధి అయిన తల్లి తన కోసం ప్రతి నెల డబ్బులు పంపేది. అది చూసి తన ఫ్రెండ్స్ తనకి ఎవరితోనో అక్రమ సంబంధం ఉందని, అందుకే తనను ఇంట్లో ఎక్కువ రోజులు ఉందనివ్వదనిఅనుకునేవారు.
అది నిజమో కాదా అని కూడా తెలుసు కోకుండ ఉద్యోగం వచ్చిన కూడా తన తల్లికి చెప్పకుండా హాస్టల్ నుంచే సిటీ కు వెళ్ళిపోయాడు.పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లల్తో బాగానే సెటిల్ అయ్యాడు.
ఒక రోజు సిటీలో కలిసిన మాస్టర్ను చూసి పలకరిస్తే తను కోపంగా మొహం చటేసాడు.తన వెనకే వెళ్లి పలకరించాడు రవి. దానికి మాష్టారు ఓ మేము గుర్తున్నమా, మీ లాంటి గొప్ప వారికి మేము గుర్తు ఉన్నామా ఆశ్చర్యంగా ఉందే అని వెటకారంగా మాట్లాడాడు. ఏంటి మాస్టారు ఇలా మాట్లాడుతున్నారు అని అన్నాడు.
ఎలా మాట్లడాలి, నీ కన్న తల్లి ఎలా ఉందో చూద్దాం అని ఒక్కసారి కూడా అనిపించలేదా.పిచ్చిది పాపం నువ్వు ఏనాటి కైన వస్తావని ఎదురు చూస్తూ చచ్చిపోయింది అన్నాడు. దానికి రవిచస్తే చచ్చింది. అసలు నాకోసం ఏమి చేసిందని నేను బాధపడాలి అన్నాడు. రవిమాటలకి మాష్టారుకి కోపము వచ్చింది. అసలు నీకేం తెలుసు.తెలుసు కోవడానికి అసలు ఎప్పుడయినా ప్రయత్నించ వా.నువ్వు పుట్టుకతోనే గుడ్డివాడివిగా పుట్టావు.నువ్వు పుట్టిన వారానికే భర్తను కోల్పోయిన నీ అమ్మ నీ కోసం తన రెండు కళ్ళను నీకు అర్పించింది. నీ జీవితం చీకట్లో ఉండకూడదని, నువ్వు సంతోషం గా ఉండాలని ఎన్నో కలలు కంది..నువ్వు ఇంటికి వస్తే నీకు కడుపునిండా తిండి పెట్టాలని, నెల నెల నీకు డబ్బు పంపాలని రోజు ఒక్క పుట కారంతో తిని. పాచి పని చేసి ఎన్ని కష్టాలు పడింధి తెలుసా.నువ్వు పుట్టిన అప్పటికి మీ అమ్మ కు 19 ఏళ్లు. మీ నాన్నచనిపోయాక వాళ్ళ పుట్టింటి వాళ్ళు వచ్చి తీసుకెళ్తామని అడిగిన నిన్ను వదిలి వెళ్ళను అని, మరో పెళ్లిచచ్చిన చేసుకోనని తెగించి చెప్పింది.తన జీవితం మొత్తం నీకే ధార పోసిందిరా.నువ్వు పెళ్లిచేసుకొని పిల్లల్తో పట్నం లో సంతోషం గా ఉన్నవని తెలిసీ కూడా నీ దగ్గరకు రాలేదు.ఎక్కడ నువ్వు బాధ పడతావో అని.కాని తన చివరి రోజుల్లో నిన్ను చివరి చూపు చుసుకుందమనీ వచ్చింది.
నువ్వు అమ్మమ్మ ఎక్కడ ఉంటుంది అని అడిగిన నీ పిల్లలకు మా అమ్మ నన్ను హాస్టల్ లో వదిలేసి వేరే పరాయి మగవాడి తో లేచిపోయింది.అందుకే నాకు అమ్మ లేదు.మీకు అమ్మమ్మా కూడా లేదు.అని చెప్పినా నీ సమాధానం విని నీ ఇంటి ముందే గుండెపగిలి చచ్చింది.నీ భార్యఎవరో అడుక్కునే ముసలావిడ అనుకోని మున్సిపాలిటి వాళ్లకు ఫోన్చేసి పంపించింది.జీవితాంతం నీ కోసం ఎదురుచూస్తూ చచ్చిపోయింది పిచ్చిది పాపం అన్నాడు. మాస్టారు కాళ్లు పట్టుకుని రవిఎడవటం మెదలెట్టాడు.
తన కాళ్లను తాకవద్దు అంటూ లేచి.తన తల్లి అస్తీకలను సంచి లో నుంచి తీసి రవిచేతిలో పెట్టీ వెళ్ళిపోయాడు.తను చిందించే కన్నీళ్లు కూడా కూడా తన తల్లి పెట్టిన బిక్ష అని తెలుసుకున్న రవిపశ్చాత్తాపంతో కుమిలి పోయాడు."తల్లి ఉన్నపుడు ఆవిడని అర్ధం చేసుకోలేము. లేనపుడు అమ్మ గూర్చి అర్ధం చేసుకున్న గాని అమ్మ ఉండదు "మిత్రమా.. !
]]>