విశాఖపట్నం జిల్లాలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాటికమ్మలు తెచ్చుకునేందుకు దారపర్తి కొండలరావు, దేముడమ్మ దంపతులు జలాశయం అడు వైపు ఒడ్డునకు నాటు పడవలో వెళ్లారు. ఈ తాటికమ్మలు సేకరించి వస్తుండగా ఈదురు గాలులతో పరిస్థితి విషమించడంతో ఊహించని విధంగా ప్రమాదంలో చిక్కుకున్నారు. జలాశయంలో నీళ్లు సుడులు వేయడంతో పడవ బోల్తా పడి కిందపడిపోయారు. నీళ్ల సుడుల్లో మునిగిపోతోన్న భార్యదేముడమ్మను కాపాడుకునేందుకు కొండలరావు విఫల ప్రయత్నం చేశారు.
చివరకు చేసేదేం లేక తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఈదూకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. తర్వాత ఈ విషయం పోలీసు, రెవెన్యూ సిబ్బంది అప్రమత్తమయ్యారు. మత్స్యకారులతో గాలింపు చర్యలు చేపట్టారు. దేముడమ్మ మృతదేహం జలాశయంలో పైకి తేలడంతో ఒడ్డుకు చేర్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
]]>