ఇరు తెలుగు రాష్ట్రాల పోలీసుల పని తీరు అద్భుతం. నిద్రాహారాలు కూడా మాని వారు పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. నేను హైదరాబాద్ నుంచి స్వయంగా చూస్తున్నాను... మీ సేవలు అనీర్వచనీయం అన్నారు. ప్రజలంతా పోలీసులకు సహకరించండి. పోలీసులు చేస్తున్న పనికి ఓ పోలీసు బిడ్డగా నేను వారికి సెల్యూట్ చేస్తున్నాను అని చిరంజీవిచెప్పారు. తాజాగా మెగాస్టార్చిరంజీవిట్వీట్ పై తెలంగాణడీజీపీ స్పందించారు.
మీరు కేవలం మమ్మల్ని మాత్రమే ప్రేరేపించలేదని... కరోనాపై పోరాడుతున్న ప్రతి ఒక్కరినీ ప్రేరేపించారని డీజీపీ అన్నారు. మీ నుంచి స్ఫూర్తిని పొందే ఎంతో మందిని మేల్కొలిపారని కితాబిచ్చారు. కరోనాపై పోరాటంలో తమకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటాయని చెప్పారు. మీ సందేశం ప్రతి ఒక్కరూ లాక్ డౌన్ నిబంధనలకు కట్టుబడి ఉండేలా చేస్తాయని అన్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కరోనాని కట్టడి చేయడానికి డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు ఎంతో కష్టపడుతున్నారు.
]]>You have not only inspired us, the entire force, but also awakened a wide audience, who gets inspired by you. "Being a member from police Family'' - it means a lot, would help us greatly, in this battle against #Covid19. Your words can surely let everyone stick to #LockDown. https://t.co/ovgj4HvdYT
— DGP telanganapolice (@TelanganaDGP) April 10, 2020