Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 297578

బాబు ఏపీకి వస్తే... నిర్బంధం తప్పదా...?

$
0
0
టీడీపీఅధినేత చంద్రబాబు ప్రస్తుతం హైదరాబాదులో ఉన్నారు.ఆయన అక్కడ ఉన్నా ఏపీరాజకీయాలు సంబంధించి తరచుగా వివాదాస్పద కామెంట్లు చేస్తూ, కాక పుట్టిస్తూ, ఏపీప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. జగన్పరిపాలన చేతకావడం లేదు అని, అదే తాను ఇప్పుడు ఏపీలో ఉంది ఉంటే మొత్తం కరోనా ని కంట్రోల్ చేసే వాడిని అన్నట్టుగా చంద్రబాబు మాట్లాడుతున్నారు. రాష్ట్రం విపత్కర పరిస్థితుల్లో ఉంటే ప్రభుత్వానికి ప్రజలకు సలహాలు ఇవ్వాల్సింది పోయి, చంద్రబాబు ఈ విధంగా రొటీన్ గా రాజకీయ విమర్శలు చేయడం పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఏపీఇప్పుడు ఎంత కష్ట కాలంలో ఉందో తెలిసిందే. ఈ కష్ట సమయంలో చంద్రబాబు కుటుంబంతో సహా హైదరాబాద్లో రెస్ట్ తీసుకుంటున్నారు. అక్కడి నుంచే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసిపినాయకులు చంద్రబాబు విమర్శలకు దీటుగా సమాధానం ఇస్తున్నారు.

IHG


ఈ మేరకు ఏపీమంత్రిమోపిదేవివెంకటరమణ చంద్రబాబు పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఏపీప్రభుత్వం కరోనాను కట్టడి చేసే  విషయంలో అన్ని రకాల చర్యలను కఠినంగా తీసుకుంటోంది అని చెప్పుకొచ్చారు. తెలంగాణనుంచి వచ్చిన వారిని 14 రోజులు క్వారంటైన్ లో పెట్టి అప్పుడు మాత్రమే  విడుదల చేస్తామని ఆయన తెలిపారు. ఇవేవి పరిగణలోకి తీసుకోకుండా టీడీపీఅధినేత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారని మోపిదేవిమండిపడ్డారు. అసలు చంద్రబాబు కరోనాకు భయపడకుండా ఏపీకి రావాలని మోపిదేవిడిమాండ్ చేశారు. చంద్రబాబు ఏపీకి రావాలంటే ముందుగా తెలంగాణప్రభుత్వం అనుమతి తీసుకోవాలని, ఆ తర్వాత ఏపీలో విధించిన నిబంధనల ప్రకారం 14 రోజుల పాటు క్వారంటన్ లో ఉండి తీరాలని మోపిదేవిక్లారిటీ ఇచ్చారు. 



తాము రూల్స్ ను ఖచ్చితంగా అమలు చేస్తామని, చంద్రబాబు నాయుడిని అయినా వదలకుండా క్వారంటైన్ కి తరలిస్తామని మోపిదేవిచెప్పుకోవచ్చారు. వైసిపివ్యవహారాన్ని బట్టి చూస్తుంటే చంద్రబాబు ను ఇప్పుడప్పడే ఏపీకి రాకుండా వైసీపీప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టడి చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. మోపిదేవివ్యాఖ్యలపై చంద్రబాబు ఏ విధంగా స్పందిస్తారో, ఇప్పట్లో ఏపీకి వచ్చే సాహసం చేస్తారో లేక మరికొంత కాలం హైదరాబాద్లోనే మకాం వేస్తారో చూడాలి.

]]>

Viewing all articles
Browse latest Browse all 297578

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>