అయితే ఈ పరిస్థితిని గ్రహించిన కేంద్రంతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజలకు ఇప్పటికే ఉచిత రేషన్ తో పాటు కొంత మేర ఆర్ధిక సాయాన్ని కూడా ప్రకటించడం జరిగింది. ఇక ఇటువంటి భయంకర విపత్తు సమయంలో అట్టడుగు వర్గాల ప్రజలను ఆదుకోవడం మా బాధ్యతని భావించి ఇప్పటికే పలు రంగాలకు చెందిన కొందరు ప్రముఖులు ముందుకు రావడం, తమ శక్తికొలది వీలైనంత మేర విరాళాల రూపంలో అందించడం జరిగింది.
ఇక ఇటువంటి కష్ట సమయాల్లో ప్రజలకు ఎప్పుడూ తమ వంతుగా సాయం అందించడంలో ముందు ఉండే టాలీవుడ్సినిమాపరిశ్రమనుండి కూడా ఇప్పటికే పలువురు ప్రముఖులు విరాళాలు ప్రకటించగా, నేడు టాలీవుడ్ప్రముఖ కమెడియన్బ్రహ్మానందం రూ.3 లక్షల ఆర్ధిక సాయాన్ని మెగాస్టార్చిరంజీవిప్రారంభించిన కరోనా విపత్తు నిధికి ఇవ్వడం జరిగింది. ఇటువంటి సమయంలో ప్రజలను ఆదుకోవడం మన అందరి బాధ్యత అని, ఆర్ధికంగా స్థోమత ఉన్న మిగతా వారు కూడా ముందుకు వచ్చి తమకు తోచినంత సాయం అందిస్తే బాగుంటుందని బ్రహ్మానందం కోరుతున్నారు. ఈ కష్ట సమయంలో ప్రజలను ఆదుకోవడానికి ముందుకు వస్తున్న ప్రముఖులపై పలువురు ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు....!!
]]>