Quantcast
Channel: indiaherald.com - RSS Feeds
Viewing all articles
Browse latest Browse all 305735

మనసున్న మారాజులు పఠాన్ బ్రదర్స్...!

$
0
0
భారత్లో పఠాన్ బ్రదర్స్ అంటే చాలా మందికి ఇట్టే అర్థమైపోతుంది. పఠాన్ బ్రదర్స్ అంటే మరెవరో కాదండి యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్. మన టీమిండియాలో అన్నదమ్ములుగా చెప్పుకుంటే ముందుగా చెప్పుకునేది వీరిద్దరి పేర్లే. వీరిద్దరూ టీమిండియా తరపున అనేక మ్యాచ్ లు అన్ని ఫార్మాట్లలో ఆడారు. వీరిద్దరూ విభిన్న శైలిలో వారి ప్రతిభను చాటారు.


ఇక వీరిద్దరి గురించి ఒకసారి చూస్తే... యూసుఫ్ పఠాన్ గురించి చూస్తే మ్యాచ్ ని అమాంతం తన జట్టు వైపు లాగేసుకుని ట్యాలెంట్ ఉన్న వ్యక్తి. ఇక మరో బ్రదర్ ఇర్ఫాన్ పఠాన్ టీమిండియాలో స్వింగ్ చేసే బౌలర్లలో మొదటగా వినిపించే పేరు ఇర్ఫాన్ పఠాన్. ఎందుకంటే ఈయన బౌలింగ్లో ప్రత్యేకత బాల్ ని కావలసినంత స్వింగ్ చేయడమే. అంతేకాదు ఇర్ఫాన్ పఠాన్ తన బ్యాటింగ్ తో కూడా అనేకసార్లు మ్యాచ్ ని గెలిపించడంలో ముఖ్య పాత్ర పోషించాడు. ఇక వీరిద్దరూ కేవలం గ్రౌండ్ లోనే కాకుండా బయట కూడా దేశానికి సేవచేయడంలో ముందుటారని చెప్పవచ్చు.




ప్రస్తుతం మన దేశం కరోనాతో ఇబ్బందులు పడుతూ ఉంటే ఈ పఠాన్ బ్రదర్స్ సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఇద్దరూ కలిసి నిరుపేద వర్గాలను ఎంచుకొని వారికి పది టన్నుల బియ్యం, ఏడు టన్నుల ఆలుగడ్డలను అందజేశారు. అంతేకాకుండా ఈ పఠాన్ బ్రదర్స్ నిరుపేదలకు మాస్కులు ఆరోగ్య ఉత్పత్తులను అందించడం జరిగింది.

]]>

Viewing all articles
Browse latest Browse all 305735

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>