అయితే తమ సతీమణి కావ్య ఇంట్లో తీరిక సమయాల్లో కరోనా మాస్కులు తయారుచేస్తోందని తెలిపారు. అందరికీ మాస్కులు అంటూ ప్రధానినరేంద్రమోదీపిలుపుమేరకు ఆమె మాస్కుల తయారీ చేపట్టిందని వివరించారు. ఇంట్లో మాస్కులు తయారు చేసి అవసరం ఉన్నవారికి అందజేస్తున్నామని.. ఇది ఎంతో మందికి మేలు చేస్తుందని అన్నారు. ప్రస్తుతం ప్రధానినరేంద్రమోదీదేశంలో లాక్ డౌన్ ప్రకటించిన కరోనా వ్యాప్తిని చాలా వరకు కట్టడి అయ్యేలా చేశారని.. భారత ప్రధానినిర్వహిస్తున్న పనులు.. ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు.
అంతే కాదు ఆయనను ఎంతో మంది ప్రశంసిస్తున్నారని అన్నారు. ప్రధానిమోదీఇచ్చిన పిలుపుమేరకు ప్రతి కుటుంబం ముందకొచ్చి మాస్కుల తయారీలో పాలుపంచుకోవాలని సూచించారు. అంతేకాదు, తన భార్యకావ్య మాస్కులు తయారు చేస్తున్న ఫొటోలను కూడా ట్వీట్ చేశారు.
]]>In these trying times in response to call of #Masks4All given by our leader@narendramodi Ji, my wife Kavya in better usage of her time is making masks at home for people in need. Every family should come fwd to do its bit.@AnupamPKher@akshaykumar@DrKumarVishwas@gauravcsawantpic.twitter.com/Rla9ovMQsa
— g kishan reddy (@kishanreddybjp) April 10, 2020