అదే సమయంలో ఏపీలోనూ తీవ్రస్థాయిలో కరోనా విజృంభించడంతో ఎన్నికల సంగతి అందరూ మర్చిపోయారు. ప్రస్తుతం ఏపీలో కరోనా ప్రభావం తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్పై వైసీపీప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఆయన రాజ్యాంగ పరిధిలో ఉండటంతో ఆయనను పదవి నుంచి తప్పించాలని, దీని కోసం అభిశంసన చేపట్టాలి. పార్లమెంటు ఉభయ సభల అంగీకారంతో పాటు రాష్ట్రపతి ఆమోదం లభిస్తే అభిశంసన పూర్తయ్యి కమిషనర్ పదవిని నిమ్మగడ్డ రమేష్ కుమార్కోల్పోవాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వ్యవహారం అంత తేలిగ్గా జరిగే విషయం కాదు. అందుకే దీనికి ప్రత్యామ్నాయంగా ఆర్డినెన్స్ ను తెరపైకి తీసుకు వస్తోంది వైసీపీప్రభుత్వం.
విధి నిర్వహణలో ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్విఫలమయ్యారనే కారణం చూపిస్తూ ఆయనపై వేటు వేయాలని చూస్తోంది. మరో కొద్ది రోజుల్లో ఏపీకేబినెట్సమావేశం అవుతున్న నేపథ్యంలో ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ను తొలగించే అంశంపైన, ఆర్డినెన్స్ పైన చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు కొత్త ఎన్నికల కమిషనర్ ను నియమించే విషయంలోనూ అనేక సంస్కరణలు చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. కొత్తగా కమిషనర్ గా నియమించే వ్యక్తి కి కనీసం హైకోర్టు న్యాయమూర్తి హోదా కలిగిన వారు అవ్వడంతో పాటు, మూడేళ్ల పదవీ కాలంలో మాత్రమే ఉండేలా నిబంధనలు తీసుకురావాలని రాష్ట్రపతిని కోరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
]]>