లాక్‌డౌన్ నేపథ్యంలోనూ అనవసరంగా బయటకు వస్తే చట్ట ప్రకారం వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. లాక్‌డౌన్ నిబంధనలను పక్కాగా అమలు చేసేందుకు పోలీసులు అన్ని ప్రాంతాల్లో గస్తీ కాస్తున్నారు. అయితే దేశంలో ఇప్పుడు ఢిల్లీనిజాముద్దీన్‌లోని మర్కజ్ మత ప్రార్థనలో పాల్గొన్న వారికే ఎక్కువ కరోనా వైరస్సోకడం.. వారు కాస్త దేశంలో వివిధ రాష్ట్రాల్లోకి వెళ్లడంతో దీని ప్రభావం విపరీం అయ్యింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో భద్రత మరింత పటిష్టం చేశారు. షాహ్‌దరా జిల్లాలో డ్రోన్లతో ఢిల్లీలో తీసిన దృశ్యాలను పోలీసులు మీడియాకు అందించారు.
ముఖ్యంగా కంటోన్మెంట్ ప్రాంతాల్లో నిఘాను పెంచేశారు. ఎల్లప్పుడూ రద్దీగా ఉండే ప్రాంతాలన్నీ ప్రస్తుతం బోసిబోయి కనపడుతున్నాయి. వాహనాలపై అనవసరంగా రోడ్లపై తిరుగుతున్న వారిని, మాస్కులు ధరించకుండా బయటకు వస్తోన్న వారిని పోలీసులు గుర్తించి కేసులు నమోదు చేస్తున్నారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య 6412కు చేరిందని కేంద్రఆరోగ్య శాఖ ప్రకటించింది. వారిలో 5709 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తుండగా, 503 మంది డిశ్చార్జ్ అయ్యారు. గడచిన 12 గంటల్లో దేశంలో 30 మంది ప్రాణాలు కోల్పోయారు.
]]>#WATCH Delhi: Drones being used for surveillance by delhipolice in areas where the containment zone plan is operational. Visuals from Shahdara district. (Video source: delhi Police) pic.twitter.com/xuNezv3v5f
— ANI (@ANI) April 10, 2020